Begin typing your search above and press return to search.
ఎనర్జిటిక్ స్టార్ ఎనర్జి ఈ రేంజ్ కు సరిపోయేనా?
By: Tupaki Desk | 1 July 2022 2:30 PM GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ ది వారియర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సినిమాకు అన్ని విధాలుగా పాజటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు లింగుస్వామి కాస్త ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. ఆ బడ్జెట్ 70 కోట్లు అంటూ వార్తలు వస్తున్నాయి. రామ్ సినిమాకు 70 కోట్లు అంటే నమ్మబుల్ గా లేదు.. కాని దర్శకుడు మరియు హీరో హీరోయిన్ పై నమ్మకంతో నిర్మాతలు అంత మొత్తంను ఖర్చు పెట్టారనేది ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న బలమైన సమాచారం.
రామ్ సినిమా 70 కోట్లు అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంత చేయక పోవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని సినిమాకు ఉన్న పాజిటివ్ బజ్ మరియు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సక్సెస్ సెంటిమెంట్ కారణంగా థియేట్రికల్ రైట్స్ ఏకంగా 40 కోట్లకు కాస్త అటు ఇటుగా చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా తక్కువేం కాదు.. దాదాపుగా 32.5 కోట్ల రూపాయల వరకు ది వారియర్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ది వారియర్ మొత్తానికి ప్రీ రిలీజ్ బిజినెస్ తో 70 కోట్లకు పైగానే నిర్మాత ఖాతాలో పడేలా చేశాడు. ఇప్పుడు థియేట్రికల్ రన్ లో ఈ సినిమా ఎంత వసూళ్లు చేస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కనుక కనీసం 42.5 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
రామ్ ఎనర్జీకి అది సాధ్యమా అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించేందుకు రామ్ ఎనర్జీ ఏమేరకు సరిపోతుంది అనేది ఆసక్తికర విషయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటే తప్ప సినిమా కు ఆ స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యే పరిస్థితి లేదు.
ఫ్యామిలీ ఆడియన్స్.. యూత్ మరియు మాస్ అన్ని వర్గాల వారిని ఈ సినిమా ఆకట్టుకుంటే తప్పకుండా నాలుగు పదుల కోట్లు అనేది కష్టం కాదు. కాని ఈమధ్య కాలంలో పరిస్థితి ఆశాజనకంగా లేదు. కనుక ఏం జరుగుతుంది అనేది చూడాలి.