Begin typing your search above and press return to search.
రామ్ చరణ్ ... మంచు విష్ణు సేమ్ టు సేమ్ అదెలా?
By: Tupaki Desk | 10 April 2022 2:30 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మంచు వారబ్బాయి, `మా` అధ్యక్షుడు మంచు విష్ణు సేమ్ టు సేమ్ ఏంటీ? .. అసలు ఈ కథేంటి? అని ఆరాతీస్తే ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళితే... మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ హీరోగా తండ్రి మార్కుకు భిన్నంగా తనదైన ప్రత్యేకతని చాటుకుంటున్నారు. ఇండస్ట్రీలో వున్న స్టార్ హీరోల్లో ఒకడిగా తనదైన ముద్రని ప్రదర్శిస్తూ టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
ఇటీవల జక్కన్న తెరకెక్కించిన మూవీ `ట్రిపుల్ ఆర్` తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఓ పక్క హీరోగా తన దైన పంథాను ఆవిష్కరిస్తూనే నిర్మాతగా కూడా ఎంట్రీ ఇచ్చారు. `ఖైదీ నం.150` చిత్రంతో నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ని స్థాపించి వరుసగా తండ్రి చిరంజీవితో సినిమాలు నిర్మిస్తున్నారు. `సైరా నరసింహారెడ్డి` తరువాత తండ్రి మెగాస్టార్ తో రామ్ చరణ్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం `ఆచార్య`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ లుగా నటించారు. ఇదిలా వుంటే మంచు విష్ణు కూడా ఇదే తరహాలో సేమ్ టు సేమ్ అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పోటీపడుతున్నారు. చరణ్ తరహాలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటవారసత్వాన్ని కొనసాగిస్తూ మంచు విష్ణు హీరోగా తెరంగేట్రం చేశారు. అయితే చరణ్ స్థాయి స్టార్ డమ్ ని సొంతం చేసుకోలేకపోయినా హీరోగా మాత్రం పేరు తెచ్చుకున్నారు.
ఇటీవల `మా` అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు .. చరణ్ తరహాలోనే సినిమాల్లో నటిస్తూనే తాను కూడా నిర్మాతగా తండ్రి మోహన్ బాబుతో సినిమాలు నిర్మిస్తున్నారు. మోహన్ బాబు హీరోగా `మామ మంచు - అల్లుడు కంచు`, రీసెంట్ గా `సన్ ఆఫ్ ఇండియా` వంటి చిత్రాలని అందించారు. ఈ జనరేషన్ లో ఇలా తండ్రి తో సినిమాలని నిర్మించిన హీరోలుగా రామ్ చరణ్, మంచు విష్ణు సేమ్ టు సేమ్ అనిపించుకున్నారు. గత కొంత కాలంగా హీరోగా సక్సెస్ ని సాధించి మళ్లీ ట్రాక్ లోకి రావాలని మంచు విష్ణు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మంచు విష్ణు చేసిన ప్రయత్నం `మోసగాళ్లు` ఆశించిన ఫలితాన్ని అందించలేకపోగా చేతు అనుభవాన్ని మిగిల్చింది. ప్రస్తుతంత జి. నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు మంచు విష్ణు.
ఇందులో సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ ఇద్దరు హీరోల తరహాలోనే కింగ్ నాగార్జున కూడా తండ్రితో సినిమాలు నిర్మించిన హీరోగా రికార్డు సొంతం చేసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమాభిషేకం, శ్రీరంగ నీతులు, సీతారాముల కల్యాణం చూతము రారండి వంటి చిత్రాలని నిర్మించారు. నాగార్జున తరహాలోనే నందమూరి హరికృష్ణ కూడా తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావుతో `డ్రైవర్ రాముడు` లాంటి చిత్రాలని నిర్మించి తండ్రితో సినిమాలు నిర్మించిన తనయుడిగా నిలిచారు