Begin typing your search above and press return to search.
ఇద్దరు హీరోయిన్లతో చెలరేగిపోతున్న మాస్ మహారాజ్!
By: Tupaki Desk | 5 April 2022 11:30 PM GMTరవితేజ ఎప్పటిలానే తనదైన దూకుడు చూపుతున్నాడు. వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ కుర్ర హీరోలతోనే ఔరా! అనిపిస్తున్నాడు. రవితేజ కథల విషయంలో నాన్చుడు తీరు కనిపించదు. కథ వినడం .. ఆ కథ విషయంలో తన అభిప్రాయం చెప్పడంలో ఎంత మాత్రం ఆలస్యం చేయడు. ఒక సినిమాకి కొబ్బరికాయ కొట్టడానికీ .. గుమ్మడికాయ కొట్టడానికి మధ్య ఆ యన ఎక్కువ గ్యాప్ తీసుకోడు. అలాగే ఒక ప్రాజెక్టు నుంచి మరో ప్రాజెక్టు పైకి వెళ్లడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోడు. అందువల్లనే చాలా తక్కువ సమయంలోనే ఆయన 70 సినిమాల వరకూ వచ్చేశాడు.
రవితేజ కథల్లో మొదటి నుంచి కూడా అల్లరి .. ఆకతాయితనం ఉంటాయి. ఆయనలోని ఈ ప్రత్యేకతనే మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఆయన సినిమాల్లో కామెడీ టచ్ తో కూడిన మాస్ యాక్షన్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయన తన సినిమాల్లో రొమాంటిక్ పాళ్లు పెంచుతూ వెళుతుండటం కనిపిస్తోంది.
ఇద్దరు హీరోయిన్లతో సందడి చేయడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. అదే సమయంలో కొత్త హీరోయిన్లను రంగంలోకి దింపడానికి కూడా ఆయన ఆసక్తిని చూపుతున్నాడు. 'ఖిలాడి' నుంచి ఆయన ఈ పద్ధతిని పెర్ఫెక్ట్ గా ఫాలో అవుతుండటం కనిపిస్తుంది.
'ఖిలాడి' సినిమాలో రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి అందాల సందడి చేశారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఇద్దరు భామలతో కలిసి ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు.
అంతకుముందు వాళ్లకి ఎలాంటి క్రేజ్ లేకపోయినా ఆయన అభ్యంతర పెట్టకపోవడం విశేషం. ఇక జూన్ 17న రానున్న 'రామారావు ఆన్ డ్యూటీ'లోను, దివ్యాన్ష కౌశిక్ - రజీషా విజయన్ కనువిందు చేయనున్నారు. ఈ ఇద్దరి ముద్దుగుమ్మలతో కలిసి ఒక రేంజ్ లో ఆయన చెలరేగిపోయాడని అంటున్నారు.
రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ' టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో, నుపుర్ సనన్ - గాయత్రి భరద్వాజ్ తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. ఈ బ్యూటీల నుంచి కూడా అవసరమైనంత అందాల ఆరబోత ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక 'రావణాసుర' విషయానికి వస్తే ఇద్దరికి మించి కథానాయికలు కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమాలో రవితేజ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. దక్షా నగర్కార్ .. ఫరియా అబ్దుల్లా కనిపించనున్నారు. ఇలా రవితేజ ఏ సినిమాలో చూసినా .. ఇద్దరు హీరోయిన్లకు తగ్గేదే లే అన్నట్టుగానే దూకుడు చూపిస్తున్నాడు. మరి ఈ ఇద్దరి హీరోయిన్ల కాన్సెప్ట్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.