Begin typing your search above and press return to search.

`బుల్ బుల్ త‌రంగ్` తో రామారావు మ్యూజిక్ ట్రీట్!

By:  Tupaki Desk   |   10 April 2022 7:56 AM GMT
`బుల్ బుల్ త‌రంగ్` తో రామారావు మ్యూజిక్ ట్రీట్!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా నూత‌న ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `రామారావు ఆన్ డ్యూటీ` తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్..ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రామారావు టైటిల్ తోనే సినిమా ఆడియ‌న్స్ లోకి వెళ్లిపోయింది. ఆపై ర‌వితేజ మాస్ ఇమేజ్ తో మ‌రింత హైప్ తీసుకొస్తున్నారు.

తాజాగా నేడు శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా ఫ‌స్ట్ సింగిల్ ని రిలీజ్ చేసారు. స్టార్ సింగ‌ర్ గా వెలిగిపోతున్న సిద్ శ్రీరామ్ ఆల‌పించిన‌ ‘బుల్ బుల్ తరంగ్’ అంటూ సాగే పాట‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా చేశారు. సిద్ శ్రీరామ్ విన‌సొంపైన గాత్రంతో ఆక‌ట్టుకుం టున్నాడు. మెలోడీ సాంగ్..ట్యూన్స్ విన‌సొంపుగా ఉన్నాయి. ఫస్ట్ టైం వినడంలోనే శ్రోత‌ల్ని ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. విజువ‌ల్ గానూ సాంగ్ క్యూట్ అండ్ క‌ల‌ర్ ఫుల్ గా క‌నిపిస్తుంది.

పాట‌లో హీరో..హీరోయిన్ లుక్స్ బాగున్నాయి. ముఖ్యంగా సంగీత ద‌ర్శ‌కుడు సామ్ సి ఎస్ మార్క్ పాట‌లో క‌నిపిస్తుంది. ఫస్ట్ సాంగ్ నుంచే మంచి హిట్ ట్రాక్ అందించాడని తెలుస్తోంది. మిగ‌తా పాట‌లు ఎలా ఉంటాయ‌న్న‌ది చూడాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో టీజ‌ర్ రిలీజ్ కోసం మాస్ రాజా అభిమానులు ఎంతో ఎగ్టైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న రామారావు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాడు. వచ్చే జూన్ 17న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇక ర‌వితేజ `రావ‌ణాసుర‌`..`టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`..`ధ‌మాకా` చిత్రాల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మూడు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఒకేసారి మూడు సినిమాలు షూటింగ్ జ‌ర‌గ‌డంతో ర‌వితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. అన్నిసినిమా సెట్స్ ని షెడ్యూల్ ప్ర‌కారం చుట్టేస్తున్నారు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా రాజా వేగం యాధావిధిగా కొన‌సాగుతుంది. రామారావు స‌క్సెస్ తో ట్రాక్ లోకి వ‌చ్చేస్తార‌ని అంతా ధీమాగా ఉన్నారు.