Begin typing your search above and press return to search.

RRR: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల వసూళ్ళ వివరాలు..!

By:  Tupaki Desk   |   29 March 2022 8:30 AM GMT
RRR: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల వసూళ్ళ వివరాలు..!
X
'ఆర్.ఆర్.ఆర్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఫస్ట్ వీకెండ్ లో భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. మొదటి సోమవారం కూడా స్ట్రాంగ్ గా నిలబడింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు ఈ మల్టీస్టారర్ మూవీ దాదాపు 17.50 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

RRR సినిమా మొదటి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 281.75 కోట్ల షేర్ తో ₹ 470.35 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు నివేదికలు వెల్లడించాయి. నాలుగో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం కలెక్షన్లలో 55 శాతానికి పైగా సోమవారం రావడం అంటే అసాధారణమనే చెప్పాలి.

మొత్తం మీద ఏపీ & తెలంగాణలలో మొదటి నాలుగు రోజుల్లో RRR సినిమా 154.30 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు నివేదిస్తున్నాయి. ఆదివారంతో పోలిస్తే నైజాం ఏరియాతో పాటు ఏపీలోని మరికొన్ని సెంటర్లలో టిక్కెట్ల ధరలు కాస్త తగ్గాయని తెలుస్తోంది. దీంతో వీక్ డేస్ లో బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద గట్టి ప్రభావమే చూపిస్తోంది. బలమైన మౌత్ టాక్ తో ఓపెనింగ్ డే కంటే రెండు మూడో రోజుల వసూళ్ళలో పెరుగుదల కనిపించింది. కోలీవుడ్ ట్రీడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలి మూడు రోజులకు ఈ చిత్రం తమిళనాడులో 34 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

చెన్నైలో కలెక్షన్లు బాగానే ఉన్నాయి. సోమవారం థియేటర్ ఆక్యుపెన్సీ ఆశాజనకంగా ఉండటంతో మిగతా సాధారణ రోజుల్లో కూడా మంచి నంబర్స్ ఎక్సపెక్ట్ చేయొచ్చు. నార్త్ ఇండియాలో ఫస్ట్ డే 19 కోట్లు రాబట్టిన RRR.. వారాంతానికి రూ.74.50 కోట్లు రాబట్టింది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రం బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ఉంది. ఈ వీకెండ్ లో మంచి బిజినెస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పటి వరకు రికవరీ రేటు బాగానే ఉంది. బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

నివేదిక ప్రకారం AP/TS నాలుగు రోజుల కలెక్షన్స్ వివరాలు...
నైజాం – 61.60 కోట్లు
సీడెడ్ – 28.50 కోట్లు
యూఏ – 18.95 కోట్లు
నెల్లూరు – 5.42 కోట్లు
గుంటూరు – 12.42 కోట్లు
కృష్ణా – 9.08 కోట్లు
వెస్ట్ గోదావరి – 8.71 కోట్లు
ఈస్ట్ గోదావరి – 9.63 కోట్లు
AP/TS మొత్తం - 154.31 కోట్లు