Begin typing your search above and press return to search.
RRR హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా మారుతారా..?
By: Tupaki Desk | 25 March 2022 3:55 AM GMTదర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్ లలో విడుదల కాబడింది. సినిమా టాక్ ఎలా ఉంది?, ప్లస్సులు - మైనస్సులు ఏంటి? 'బాహుబలి 2' కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తుందా లేదా? వంటి వాటిని పక్కన పెడితే.. ఇప్పుడు అందరి దృష్టి RRR హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ లపై పడింది.
'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ నటించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసిన రాజమౌళి.. ట్రిపుల్ ఆర్ హీరోలను కూడా నేషనల్ స్టార్స్ గా మారుస్తారనే చర్చ మొదటి నుంచీ జరుగుతోంది.
'బాహుబలి'కి ముందు ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే. కానీ ఈ సినిమా తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు హిందీలో అంతగా పాపులారిటీ లేదు. చెర్రీ గతంలో హిందీలో చేసిన 'జంజీర్' డిజాస్టర్ అయితే.. ఇప్పుడు RRR తో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ కు కొత్త మోహమే.
'బాహుబలి' లో బాలీవుడ్ తారాగణం లేకపోయినప్పటికీ కంటెంట్ బలంగా ఉండటం.. ఇండియన్ స్క్రీన్ మీద అంతకముందెన్నడు చూడని విజువల్ వండర్ ఆవిష్కరించడంతో నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ క్రమంలోనే ప్రభాస్ కు అంత క్రేజ్ ఏర్పడింది.
'ఆర్.ఆర్.ఆర్' విషయానికొస్తే ఇది బాలీవుడ్ జనాలు ఎప్పటి నుంచో చూస్తున్న బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. రాజమౌళి యాక్షన్ అండ్ ఎమోషన్స్ కి తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. తారక్ - చరణ్ స్టార్ పవర్ కూడా ఇక్కడ పని చేస్తుంది. కానీ 'బాహుబలి' రేంజ్ లో ఉత్తరాదిలో ఆకర్షించే అంశాలు ఎంటనేదే ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న.
బాలీవుడ్ లో సత్తా చాటితేనే ఏ హీరో అయినా పాన్ ఇండియా స్టార్ గా అవతరిస్తాడు. ఇటీవల 'పుష్ప' సినిమా కంటెంట్ మరియు కథానాయకుడి పెర్ఫార్మన్స్ నార్త్ జనాలకు నచ్చాయి కాబట్టే.. ప్రమోషన్స్ చేయకపోయినా ఆదరించారు. అల్లు అర్జున్ ని నేషనల్ స్టార్ ని చేశారు.
కానీ ఇక్కడి పైసా వసూల్ సినిమా 'ఆర్.ఆర్.ఆర్' అక్కడ ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ మార్కెట్లలో RRR క్రేజ్ అద్భుతంగా ఉందనడంలో సందేహం లేదు. భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ. కానీ బాలీవుడ్ లో ఈ చిత్రం ఎలా రాణిస్తుందనే దానిపై అందరి దృష్టి ఉంది.
ఎందుకంటే రాజమౌళి - రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలిసి నార్త్ ఇండియా అంతా తిరిగి ప్రచారం చేసినా.. హిందీలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. హిట్ టాక్ వచ్చి రివ్యూలు సానుకూలంగా ఉండే ఈరోజు నుంచి బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది.
'ఆర్.ఆర్.ఆర్' సినిమా నార్త్ సర్క్యూట్ లో సక్సెస్ అయితేనే ఎన్టీఆర్ - రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్స్ గా మారేది. ప్రభాస్ - బన్నీ మాదిరిగా ట్రిపుల్ హీరోలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.