Begin typing your search above and press return to search.

ఆ థియేటర్ లో RRR ఫస్ట్ హాఫ్ మాత్రమే చూపించారట..!

By:  Tupaki Desk   |   26 March 2022 3:30 AM GMT
ఆ థియేటర్ లో RRR ఫస్ట్ హాఫ్ మాత్రమే చూపించారట..!
X
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిన్న శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఎన్టీఆర్ - రామ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది.

ఓవర్సీస్ లో అత్యధిక స్క్రీన్ లలో RRR మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ప్రేక్షకులకు.. కాలిఫోర్నియాలోని ఓ థియేటర్‌లో నిరాశ ఎదురైందని తెలుస్తోంది.

రాజమౌళి మాగ్నమ్ ఓపస్ RRR ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి వెళ్లిన సినీ ప్రియులు థియేటర్ లో సాంకేతిక లోపం వల్ల సినిమా సెకండ్ హాఫ్ చూడలేకపోయారు. ఈ విషయాన్ని ఫిలిం క్రిటిక్ ఒకరు సోషల్ మీడియాలో వెల్లడించారు.

"మొదటిసారి ఇలా జరిగింది! RRR మొదటి రోజు మొదటి ఆట చూడటానికి సినిమార్క్ నార్త్ హాలీవుడ్ కి వెళ్లాను. ఫస్ట్ హాఫ్ చూసాను కానీ థియేటర్ ఇంజెక్ట్ చేయనందున సెకండ్ హాఫ్ చూడలేకపోయాను. ఇది నమ్మలేని విసుగు తెప్పించింది. ఏడవాలనుకుంటున్నాను" అని సదరు ఫిలిం క్రిటిక్ ట్విట్టర్‌ లో తెలిపారు.

కాగా, ఓవర్ సీస్ లో ప్రీమియర్స్ తోనే సత్తా చాటిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా RRR.. ఖండఖండాలలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని సరికొత్త రికార్డులు తిరగరాయడం ఖాయమని తెలుస్తోంది.

ఇన్నాళ్లూ నాన్ బాహుబలిగా చెప్పుకుంటూ వస్తున్న రికార్డులు ఇకపై నాన్ ఆర్.ఆర్.ఆర్ గా మారబోతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. RRR సినిమా 1920స్ బ్యాక్ డ్రాప్ లో ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందించబడింది.

ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ - సముద్ర ఖని - శ్రియా కీలక పాత్రలు పోషించారు.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.