Begin typing your search above and press return to search.

ఏపీ టీఎస్ లో RRR టికెట్ రేట్లు ఇలా

By:  Tupaki Desk   |   29 March 2022 5:30 AM GMT
ఏపీ టీఎస్ లో RRR టికెట్ రేట్లు ఇలా
X
ఏపీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయ‌క్ విడుద‌ల‌య్యాక RRR లాంటి పాన్ ఇండియా రిలీజ్ కి పెద్ద రేంజులో క‌లిసొచ్చింది. డార్లింగ్ ప్ర‌భాస్ అత‌డి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మొర విని ఏపీ ప్ర‌భుత్వం టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. రాజ‌మౌళి అండ్ టీమ్ ప్ర‌య‌త్నం ఫ‌లించింది. దాని ప్ర‌కారం మ‌ల్టీప్లెక్స్ టికెట్ ధ‌ర భారీగానే పెరిగింది. అలాగే సింగిల్ స్క్రీన్ల‌లోనూ పెంచుకున్నారు. బ్లాక్ మార్కెట్ య‌థావిధిగానే కొన‌సాగింద‌న్న గుస‌గుసా వినిపించింది.

ఇక‌పోతే తెలంగాణ‌ ప్రభుత్వం 10 రోజుల పాటు RRR సినిమా టిక్కెట్ ధర పెంపును అనుమతించింది. మల్టీప్లెక్స్ ల్లో మొదటి మూడు రోజులకు సాధారణ సీట్లకు రూ. 70 రిక్లైనర్ లకు రూ. 100.. తదుపరి ఏడు రోజులకు రూ. 50 అదనంగా వసూలు చేయవచ్చు.. అని క్లారిటీనిచ్చింది.

AC సింగిల్ స్క్రీన్ ల కోసం మూడు రోజులకు రూ. 50 .. తదుపరి ఏడు రూ. 30 పెంపు అనుమతించారు. పెంచిన ధరలు 10 రోజుల పాటు వర్తిస్తాయని హోం (జనరల్) స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మొదటి 10 రోజుల పాటు ఐదు షోలకు అనుమతించారు.

తాజాగా ట్రేడ్ స‌మాచారం మేర‌కు...ఆర్.ఆర్.ఆర్ తొలి వీకెండ్ ముగిసింది. వ‌సూళ్లు అద‌ర‌గొట్టింది. సోమ‌వారం నాడూ చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను తెచ్చింది. అయితే తొలి మూడు రోజుల కోసం స్పెష‌ల్ హైక్ రేట్లు ఇక ముగిసిన‌ట్టే. ఇప్ప‌టికే తెలంగాణలో రేట్లు త‌గ్గాల్సి ఉంది. హైద‌రాబాద్ మ‌ల్టీప్లెక్సుల్లో రూ.354 టికెట్ ధ‌ర కొన‌సాగాల్సి ఉండ‌గా.. సింగిల్ స్క్రీన్ల‌లో రూ.210 వ‌ర‌కూ టికెట్ ధ‌ర మాత్ర‌మే అనుమ‌తించాలి.

కానీ వాస్త‌వ‌ ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది ఎగ్జిబిట‌ర్లు వెల్ల‌డించాల్సి ఉంటుంది. ఇక బ్లాక్ మార్కెట్ ని నిలువ‌రించేందుకు ఏపీ తెలంగాణ‌లో ఎలాంటి ప్ర‌య‌త్నాలు సాగాయ‌న్న‌ది కూడా అధికారులే చెప్పాల్సి ఉంటుంది. మ‌ల్టీప్లెక్సుల్లో తినుబండారాలు వాట‌ర్ బాటిళ్ల ఖ‌రీదు పార్కింగ్ ఛార్జీలు కూడా ఆల్వేస్ డిబేట‌బుల్ గా మారింది.