Begin typing your search above and press return to search.
వీడియో : హీరో ఛాలెంజ్ ను స్వీకరించి మరో హీరోను ఛాలెంజ్ చేసిన సామ్
By: Tupaki Desk | 30 March 2022 10:32 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెల్ల మెల్లగా బాలీవుడ్ వైపు అడుగు లు వేస్తుంది. వరుణ్ దావన్ తో ఈమె సినిమా ఉండబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే బాలీవుడ్ మూవీ పట్టాలు ఎక్కబోతుంది. ఈ సమయంలో ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. వర్కౌట్స్ చేస్తూ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఆ వీడియో లను షేర్ చేయడం ద్వారా వైరల్ అవుతున్న సమంత మరోసారి ఈ వీడియో తో వైరల్ అయ్యింది.
ఇటీవల బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ అటాక్ ఛాలెంజ్ ను షురూ చేయడం జరిగింది. ఆ ఛాలెంజ్ ను స్వీకరించిన సమంత తన వర్కౌట్ వీడియో లను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అంత బరువు ఎత్తుకుని ఆమె పడుతున్న కష్టం కు ప్రతి ఒక్కరు కూడా నోరు వెళ్లబెడుతున్నారు. ఇంతటి కష్టం ఒక హీరోయిన్ పడుతుంది అంటే నమ్మశక్యంగా లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్స్ వెండి తెరపై చూస్తే చాలా సుకుమారంగా.. అందంగా కనిపిస్తూ ఉంటారు. కాని వారి అందం వెనుక.. వారి యొక్క ఫిజిక్ వెనుక చాలా కష్టం ఉంటుందని దీంతో వెళ్లడి అయ్యింది. అందమైన సమంత కూడా ఎంతో కష్టపడటం వల్లే ఆ అందం అంటూ ఈ వీడియోను చూస్తుంటే అర్ధం అవుతుంది. టైగర్ ష్రాఫ్ ఛాలెంజ్ ను స్వీకరించి తనను నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఎటాక్ ఛాలెంజ్ ను చేసిన సమంత ఇప్పుడు ఈ ఛాలెంజ్ ను అర్జున్ కపూర్ కు ఇస్తున్నట్లుగా పేర్కొంది.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే తెలుగు లో ఈమె గుణ శేఖర్ దర్శకత్వంలో చేసిన శాకుంతలం షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు యశోద అనే ఒక భారీ పాన్ ఇండియా సినిమా ను సమంత చేస్తున్న విషయం తెల్సిందే. ఇవే కాకుండా ఈమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సమంత.. సినిమాల్లో కూడా అదే స్పీడ్ ను కనబర్చుతూ ఉంటుంది. రెగ్యులర్ గా ఈమె షూటింగ్ కు హాజరు అవుతూనే ఉంది. బాలీవుడ్ లో ఈ అమ్మడి సినిమా త్వరలోనే ప్రారంభం అవ్వబోతుంది. ఇదే సమయంలో ఈమె ఒక వెబ్ సిరీస్ ను కూడా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సమంత సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.