Begin typing your search above and press return to search.

వ‌ర్మ‌ పై నిర్మాత బూతు పురాణం.. ఎక్క‌డ బెడిసికొట్టింది?

By:  Tupaki Desk   |   10 April 2022 3:30 AM GMT
వ‌ర్మ‌ పై నిర్మాత బూతు పురాణం.. ఎక్క‌డ బెడిసికొట్టింది?
X
తెలంగాణ‌లో టీడీపీ స్థానాన్ని బీజేపీ భ‌ర్తీ చేస్తోందా..? అధికార పార్టీకి దీటుగా క్ర‌మంగా బీజేపీ ఎదుగుతోందా..? కాంగ్రెస్‌, టీడీపీలో ఉన్న పాత త‌రం నాయ‌కుల‌పై దృష్టి పెట్టిందా..? వారిని పార్టీలో చేర్చుకొని బ‌లం పెంచుకోవాల‌ని భావిస్తోందా..? అంటే ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తే అవున‌నే స‌మాధానాలు వ‌స్తున్నాయి.

తెలంగాణ‌లో ఒక వెలుగు వెలిగిన టీడీపీ రాష్ట్ర ఏర్పాటుతో క్ర‌మంగా మ‌స‌క‌బారిపోయింది. రెండు రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని భావించిన ఆ పార్టీకి తెలంగాణ మొండి చేయి చూపింది. ప‌దేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ పై హ‌క్కు ఉన్నా చంద్ర‌బాబు చేసిన పొర‌పాటుతో ఆ వాద‌న నిల‌బ‌డ‌లేక‌పోయింది. ఓటుకు నోటు కేసు ఆరోప‌ణ‌ల‌తో తెలంగాణ‌లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కేవ‌లం ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం అయింది.

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం టీడీపీ ఉన్నా లేన‌ట్లే. అలా అయిపోయింది ఆ పార్టీ ప‌రిస్థితి. రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, ఖ‌మ్మం జిల్లాలో 15 సీట్లు గెలిచి అంతో ఇంతో ప్ర‌భావం చూపించిన ఆ పార్టీ 2018 ఎన్నిక‌ల్లో పూర్తిగా చ‌తికిల‌ప‌డిపోయింది. ఖ‌మ్మం జిల్లాలో రెండు స్థానాల‌కే ప‌రిమితం అయింది. దీంతో టీడీపీలో ఉన్న కీల‌క నాయ‌కులు ఒక్కొక్కరుగా ఇత‌ర పార్టీల్లో చేరిపోయారు.

టీడీపీలో ఉన్నఒక వ‌ర్గం నేత‌లు రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేర‌గా.. మ‌రికొన్ని వ‌ర్గాల నేత‌లు టీఆర్ఎస్‌, బీజేపీ వైపు మ‌ళ్లారు. మిగిలి ఉన్న నాయ‌కుల‌పై కూడా బీజేపీ ఫోక‌స్ పెట్టింది. ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను కూడా చేర్చుకొని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌ట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ‌లో టీడీపీ అంటేనే బీసీల పార్టీగా ముద్ర‌ప‌డిపోయింది ఒక‌పుడు. ఇపుడు ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసే దిశ‌గా బీజేపీ క‌దులుతోంది.

తెలంగాణ‌లో బీసీల నాయ‌క‌త్వాన్ని ప్రోత్స‌హించి టీడీపీ స్థానాన్ని భ‌ర్తీ చేస్తోంది బీజేపీ. అందులో మొద‌టి అడుగు ఆ పార్టీ అధ్య‌క్షుడిగా బీసీ నేత అయిన బండి సంజ‌య్ ని నియ‌మించ‌డ‌మే. ఆ పార్టీ మ‌రో ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ కూడా నిజామాబాద్ నుంచి బ‌ల‌హీన వ‌ర్గాల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ నుంచి ఈటెల రాజేంద‌ర్ ను కూడా చేర్చుకొని బ‌లం పెంచుకుంది.

అలాగే.. కూన శ్రీ‌శైలం గౌడ్‌, వీరేంద‌ర్ గౌడ్ లాంటి బ‌ల‌మైన నేత‌ల‌ను కూడా త‌మ‌వైపు లాక్కుంది. తాజాగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాపై ఫోక‌స్ పెట్టింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్ష‌మ‌య్య‌గౌడ్ ను చేర్చుకొని తమ ల‌క్ష్యం, కార్యాచ‌ర‌ణ ఏమిటో చెప్ప‌క‌నే చెప్పింది.

ఇలా అధికార పార్టీకి దీటుగా బీసీల‌ను ప్రోత్స‌హించి అధికారాన్ని కొల్ల‌గొట్టాల‌ని బీజేపీ చూస్తోంది. అధికార పార్టీపై ఉన్న వ్య‌తిరేక‌త‌.., కాంగ్రెస్ లో ఉన్న అంత‌ర్గ‌త క‌ల‌హాల వ‌ల్ల ఇదే త‌మ‌కు మంచి త‌రుణ‌మ‌ని బీజేపీ భావిస్తోంది. చూడాలి మ‌రి బీజేపీ కోరిక ఏ మేర‌కు నెర‌వేరుతుందో..!