Begin typing your search above and press return to search.

అవ‌కాశాలు లేక అలాంటి ప‌ని చేసిన ప్ర‌గ్యా.. నెటిజ‌న్లు ఫైర్‌!

By:  Tupaki Desk   |   10 April 2022 6:30 AM GMT
అవ‌కాశాలు లేక అలాంటి ప‌ని చేసిన ప్ర‌గ్యా.. నెటిజ‌న్లు ఫైర్‌!
X
`టిట్టూ ఎం.బి.ఎ` అనే హిందీ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన అందాల భామ ప్ర‌గ్యా జైస్వాల్‌.. `మిర్చిలాంటి కుర్రాడు` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది. ఆ వెంట‌నే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి తెర‌కెక్కించిన `కంచె` సినిమాలో న‌టించింది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో త‌న అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను ప్రగ్యా బాగానే అల‌రించి మ‌రిన్ని అవ‌కాశాల‌ను అందుకుంది.

అయితే తెలుగులో అర డ‌జ‌న్ కు పైగా సినిమాలు చేసింది.. కానీ, స్టార్ హోదాను మాత్రం అందుకోలేక‌పోయింది. వ‌రుస ఫ్లాపుల్లో కూరుకుపోయిన ప్ర‌గ్యా జైస్వాల్‌కు ఆఫ‌ర్లు కూడా త‌గ్గిపోయాయి. ఇక సినీ కెరీర్ క్లీజ్ అయిన‌ట్టే అని అనుకుంటున్న త‌రుణంలో మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `అఖండ‌` సినిమాలో నంద‌మూరి బాలకృష్ణ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని అందుకుంది.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీ భారీ విజ‌యం సాధించిన నిర్మాత‌ల‌కు, సినిమాను కొన్న బ‌య్య‌ర్ల‌కు మంచి లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఇందులో ఓవైపు బాల‌య్య‌కు భార్య‌గా, మ‌రోవైపు జిల్లా కలెక్టర్ గా ప్ర‌గ్యా ఆక‌ట్టుకుంది. దీంతో ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ త‌ర్వాత ఆమెకు మ‌రిన్ని ఆఫ‌ర్లు వ‌స్తాయ‌ని అంద‌రూ భావించారు. కానీ, ప్ర‌గ్యా జైస్వాల్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టంటే ఒక్క కొత్త ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేయ‌లేదు.

ఇక అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో తాజాగా ఈ బ్యూటీ.. ఓ ఫారెన్‌ బ్రాండ్‌ విస్కీ ప్రమోషన్‌లో పాల్గొంది. బ్లాక్ డ్ర‌స్ ధ‌రించి యమా హాట్‌గా తయారైన ప్ర‌గ్యా.. స‌ద‌రు బ్రాండ్‌ విస్కీ బాటిల్‌ ముందు పెట్టుకుని ఫొటోల‌కు పోజులిచ్చింది. ఆపై ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. చివర్లో మందుబాబులకు హెచ్చరిక కూడా జారీ చేసింది. `బాధ్యతాయుతంగా తాగండి.. ఇది 25 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే` అంటూ ప్ర‌గ్యా చెప్పుకొచ్చింది

ఇంకేముంది ఆమెపై నెటిజ‌న్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. మ‌ద్యం బాటిల్‌ను ప్ర‌మోట్ చేసి.. మ‌ళ్లీ బాధ్యతాయుతంగా తాగ‌మ‌ని నీతులు చెబుతున్నావా..?, ఇలాంటి యాడ్లు చేసి సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నావ్‌..? అంటూ ప్ర‌గ్యాకు చివాట్లు పెడుతున్నారు. దీంతో ఇప్పుడీ విష‌యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.