Begin typing your search above and press return to search.
వాళ్లు బన్నీని అన్నారని.. మన వాళ్లు యష్ ని ఆడుకున్నారా?
By: Tupaki Desk | 11 April 2022 11:30 AM GMTఓ ప్రాంతానికి వెళితే మన హీరోని ఆడుకున్నారని, సదరు ప్రాంతం నుంచి వచ్చిన హీరోని మన వాళ్లు ఆడుకోవడం అన్నది ఇంత వరకు జరగలేదు. కానీ కన్నడ రాకింగ్ స్టార్ యష్ విషయంలో జరగడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప ది రైజ్` మూవీ ప్రచారం లో భాగంగా కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్లారు. అక్కడ కన్నడలో రిలీజ్ అవుతున్న `పుష్ప` కోసం అక్కడి మీడియా తో ప్రత్యేకంగా ముచ్చటించి సినిమా ప్రచారాన్ని కన్నడలో హోరెత్తించాలనుకున్నారు. అయితే అక్కడి మీడియా బన్నీకి ఊమించని షాకిచ్చింది.
ఈ సినిమా ప్రెస్ సమావేశం కోసం ఏకంగా రెండు గంటల పాటు వేయిట్ చేయించారని, మా టైమ్ ని వేస్ట్ చేశారంటూ అక్కడి మీడియా బన్నీపై విరుచుకుపడింది. దీంతో వారికి సర్ధి చెప్పే ప్రయత్నం చేసిన బన్నీ తనకు ప్రోగ్రామ్ ఈ టైమ్ కే చెప్పారని, ప్రత్యేక పరిస్థితులు వున్న కారణంగా ప్రత్యేక చాపర్ లలో రావాల్సి వచ్చిందని, ఆ కారణంగానే తనకు ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో మీ మనసుకి బాధ కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.
దీంతో కన్నడ మీడియా శాంతించి బన్నీకి పూర్తిగా సహకరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో బన్నీకి, కన్నడ మీడియాకు మధ్య జరిగిన సంభాషణ అంతా లీక్ అయిపోయి పెద్ద చర్చకు దారితీసింది. ఆ తరువాత సినిమా విడుదలైంది. పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు సృష్టించి దేశ వ్యాప్తంగా బన్నీని పాన్ ఇండియా స్టార్ ని చేయడం తెలిసిందే. 300 ల కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి సౌత్ తో పాటు నార్త్ లోనూ సంచలనాలు సృష్టించింది.
ఇదిలా వుంటే ఇదే తరహా అనుభవం ఇప్పడు రాకింగ్ స్టార్ యష్ కు వైజాగ్ లో ఎదురు కావడం హాట్ టాపిక్ గా మారింది. `కేజీఎఫ్ చాప్టర్ 1` సంచలన విజయాం సాధించిన నేపథ్యంలో `కేజీఎఫ్ చాప్టర్ 2` పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం తెలుగులో జోరుగా ప్రచార కార్యక్రమాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా సోమవారం హీరో యష్ తో పాటు సాయి కొర్రపాటి తదితరలు వైజాగ్ లో తెలుగు మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు,
అయితే ఈ సందర్భంగా తమకు ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పారని. ఇప్పడు 12:30 అవుతోందని అంటే మీ కోసం గంటన్నర పాటు మమ్మల్ని ఎదురుచూసేలా చేశారని ఓ పాత్రికేయుడు హీరో యష్ నే సూటిగా ప్రశ్నించాడు. దీంతో కంగుతున్న యష్ ఈ విషయం తనకు తెలియదని, షెడ్యూల్ ప్రకారం తనకు చెప్పిన టైమ్ కే మీడియా సమావేశానికి వచ్చానని, పది నిమిషాలు నా వల్ల లేట్ అయినా అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. టైమ్ విలువ ఏంటో నాకు తెలుసు. ప్రైవేట్ ప్లేయిన్ కారణంగా కూడా లేట్ అవుతూ వచ్చింది. అని చెప్పుకొచ్చారు. ఇదంతా గమనించిన వారు మన వాళ్లు బన్నీని అన్నారని.. మన వాళ్లు యష్ ని ఆడుకున్నారా? అని డౌట్ రేజ్ చేస్తున్నారు.

Looks like revenge