Begin typing your search above and press return to search.
సమంతపై జోక్ వేసినా అర్ధం కాలేదా??
By: Tupaki Desk | 2 April 2017 1:59 PM ISTఅక్కినేని నాగచైతన్య-సమంతల పెళ్లి అయిపోయిందని.. తాము మొదటిసారి కలుసుకున్న న్యూయార్క్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గర పెళ్లి చేసేసుకున్నారని.. ప్రముఖ ఇంగ్లీష్ డైలీ డెక్కన్ క్రానికల్ లో ఓ న్యూస్ వచ్చింది. పర్ఫెక్ట్ గా అల్లిన ఈ ఆర్టికల్ అందరినీ ఆశ్చర్యానికే కాదు.. షాక్ కి కూడా గురి చేసేసింది.
అయితే.. అసలు సంగతేంటంటే ఈ ఆర్టికల్ చివరి వరకు చదివితే.. చివర్లో పాఠకులను ఏప్రిల్ ఫూల్ జోక్ చేశారనే సంగతి అర్ధమవుతుంది. కానీ సగం సగం చదువరాయుళ్లు కొంతమంది ఉంటారు. అంటే ఒక సగం చదవగానే.. మిగిలిన సగం ఊహించేసుకుని సొంత కథలు అల్లి.. తమ తెలివితేటలను జనాలపై రుద్దే ప్రయత్నం చేస్తుంటారన్న మాట. సమంత పెళ్లి ఆర్టికల్ విషయంలో అదే జరిగింది. ఆ న్యూస్ డైలీ తప్పు చెప్పిందంటూ.. సొంత పాండిత్యం ప్రదర్శించేసి.. సమంత ఇంకా పెళ్ళి చేసుకోలేదు అన్నట్లు కౌంటర్లు ఇచ్చేశారు. ఓ విషయం తెలిస్తే అసలు వ్యక్తులను వెరిఫై చేసుకుని ఆర్టికల్ వండడమే చేయడం లేదనుకుంటే.. అసలు మొత్తం చదవకుండానే పాండిత్యం ప్రదర్శించే అతి తెలివి కూడా ఇప్పుడు మొదలైపోయింది.
అంత ఆర్భాటంగా ఇండస్ట్రీని.. బంధువులను అందరినీ పిలిచి ఎంగేజ్మెంట్ చేసుకున్నవాళ్లు సీక్రెట్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారో అని అయినా ఆలోచించాలి కదా. పోనీ అది కాదంటే.. ఇద్దరు ప్రముఖులపై ఏప్రిల్ ఫూల్ జోక్ చేసే ముందు.. వాళ్లను అడిగే ఆ ఆర్టికల్ పబ్లిష్ చేసుంటారనే ఆలోచన అయినా ఉండాలి కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/