Begin typing your search above and press return to search.

మాజీ భార్య‌ల‌తో అమీర్ ఖాన్ స‌ఖ్యంగా లేరా?

By:  Tupaki Desk   |   4 Aug 2022 3:30 AM GMT
మాజీ భార్య‌ల‌తో అమీర్ ఖాన్ స‌ఖ్యంగా లేరా?
X
`కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7` అంత‌కంత‌కు వేడి పెంచుతోంది. ప్ర‌తి సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూలో క‌ర‌ణ్ జోహార్ హోస్టింగ్ ప‌నిత‌నం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ముఖ్యంగా అత‌డు తార‌ల వ్య‌క్తిగ‌త జీవితాల‌ను లోతుగా ప్ర‌శ్నిస్తూ టీఆర్పీ గేమ్ ఆడుతున్న వైనంపై కొన్ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. తాజాగా మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో షోలో క‌ర‌ణ్ అడిగిన కొన్ని ప్ర‌శ్న‌లు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారాయి. అమీర్ మాజీ భార్య‌ల గురించి.. క‌రీనా ఆఫ్ట‌ర్ మ్యారేజ్ సెక్స్ లైఫ్ గురించి అత‌డి ప్ర‌శ్న‌లు హీట్ పెంచాయి.

ముఖ్యంగా అమీర్ తో మాజీ భార్య‌లు స‌రిగా లేరు! అన్న ప్ర‌చారంపైనా క‌ర‌ణ్ ప్ర‌శ్న‌ను సంధించ‌గా దానికి అమీర్ ధీటైన స‌మాధానం ఇచ్చారు. తాను మాజీ భార్య‌లు ఒకే కుటుంబంగా క‌లిసిపోతామ‌ని ఆయ‌న అన్నారు. మాజీ భార్యలు కిరణ్‌రావు- రీనా దత్తాలను వారానికి ఒక్కసారైనా కలుస్తానని అమీర్ ఖాన్ చెప్పారు. నాకు ఇద్దరి విష‌యంలో ఎంతో గొప్ప‌ గౌరవం ఉంది… అని అమీర్ అన్నారు. మాజీ భార్యలు రీనా దత్తా .. కిరణ్ రావు ల‌తో అంతా శాంతియుతంగా (క‌ల‌త‌లు లేవు) ఉందని చెప్పారు. మేము ఎల్లప్పుడూ ఒకే కుటుంబంగా ఉంటామ‌ని కూడా క‌ర‌ణ్‌ అన్నారు. కాఫీ విత్ కరణ్ త‌దుప‌రి ఎపిసోడ్ లో మాజీల‌తో తన సమీకరణాల గురించి అమీర్ ఇలాంటి చాలా సంగ‌తులు మాట్లాడాడు.

మాజీ భార్యల మధ్య విభేదాల పుకార్లను కొట్టిపారేసిన అమీర్ త‌న‌తో ఆ ఇద్ద‌రూ ఎంతో స‌ఖ్యంగా ఉంటార‌ని తెలిపాడు. మేము ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారానికి ఒకసారి అందరం కలుసుకుంటాం. ఒకరిపై ఒక‌రికి నిజమైన శ్రద్ధ ప్రేమ గౌరవం చాలా ఉన్నాయి.. అని అమీర్ తెలిపారు. అమీర్ తన లాల్ సింగ్ చడ్డా సహనటి కరీనా కపూర్ తో కలిసి ఈ షోలో కనిపిస్తారు.

కిరణ్ రావ్ తో పెళ్లికి ముందు రీనా దత్తాతో అమీర్ వివాహం జరిగింది. గత సంవత్సరం అతను కిరణ్ సామరస్యపూర్వక నిబంధనలతో విడిపోవాలన్న‌ తమ నిర్ణయాన్ని ప్రకటించారు. తమ కుమారుడు ఆజాద్ రావ్ ఖాన్ కు సహ-తల్లిదండ్రులుగా ఉంటామని చెప్పారు. అమీర్ ఖాన్ కు మొదటి వివాహం నుండి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొద‌టి భార్య రీనాకు కుమారుడు జునైద్ ఖాన్ .. కుమార్తె ఇరా ఖాన్ ఉన్నారు.

కాఫీ విత్ కరణ్ కొత్త ప్రోమోలో కరీనా -అమీర్ ఇరువురూ హోస్ట్ క‌ర‌ణ్‌ జోహార్ ను ట్రోల్ చేస్తూ సరదాగా గడిపారు. కరీనాను పిల్లలు క‌లిగిన అనంత‌రం సెక్స్ క్వాలిటీ ఎలా ఉంది? అని క‌ర‌ణ్‌ ప్రశ్నించ‌గా.. కవలలు ఉన్నందున అతని(క‌ర‌ణ్‌)కి అది బాగా తెలుసు! అని సమాధానం ఇచ్చింది. తన తల్లి ఈ షోను చూస్తోందని కరణ్ తెలిపాడు. ఇంత‌లో అమీర్ ఆ ఇరువురి సంభాష‌ణ‌ల్ని బ్రేక్ చేస్తూ.. ఇతరుల లైంగిక జీవితాల గురించి మీరు మాట్లాడటం మీ తల్లి పట్టించుకోవడం లేదా? కైసే సవాల్ పూచ్ రహా హై (ఈ ప్రశ్నలు ఏమిటి)? అంటూ క‌ర‌ణ్ ని ప్ర‌శ్నించారు. ఆ ముగ్గురి న‌డుమా అడ‌ల్ట్ కంటెంట్ తో సంభాష‌ణ‌లు షోని వేడెక్కించాయి.

`కాఫీ విత్ కరణ్ సీజన్ 7`లో రణ్ వీర్ సింగ్-ఆలియా భట్- సారా అలీ ఖాన్-జాన్వీ కపూర్- అనన్య పాండే-విజయ్ దేవరకొండ - సమంతా రూత్ ప్రభు-అక్షయ్ కుమార్ సహా పలువురు తారలు పాల్గొన్నారు. కత్రినా కైఫ్ తో ఎపిసోడ్ కూడా స్పెష‌ల్ గా డిజైన్ చేశార‌ని ప్రోమో వెల్ల‌డించింది. `ఫోన్ భూత్` మూవీ సహనటులు ఇషాన్ ఖత్త‌ర్ - సిద్ధాంత్ చతుర్వేదిలతో క‌త్రిన ఈ షోలో కనిపిస్తారు.