Begin typing your search above and press return to search.

సూర్య గెస్ట్ రోల్ పాన్ ఇండియాలో కాక‌!

By:  Tupaki Desk   |   2 Aug 2022 1:30 AM GMT
సూర్య గెస్ట్ రోల్ పాన్ ఇండియాలో కాక‌!
X
కోలీవుడ్ స్టార్ సూర్య రేంజ్ పాన్ ఇండియాలో మామూలుగా లేదిప్పుడు. `విక్ర‌మ్` సినిమా క్లైమాక్స్ రొలెక్స్ పాత్ర‌లో ఐదు నిమిషాలే క‌నిపించినా థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయాయి. పాన్ ఇండియాలోనే థియేట‌ర్ల‌న్నీ షేక్ అయిపోయాయి. ఈ విష‌యం గురించి విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఎంత గొప్ప‌గా చెప్పారో తెలిసిందే. త‌మ్ముడు సూర్య అంటూ సంబోదించి త‌మ బాండింగ్ గురించి చెప్ప‌క‌నే చెప్పారు.

ఓ యూనివ‌ర్శ‌ల్ స్టార్ అలా స్పందించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. అత‌ను ఎంతో పెద్ద స్టార్ అయితేనే దిగ్గ‌జాలు అంత‌లా రియాక్ట్ అవుతుంటారు. త‌మిళ్..తెలుగులో సూర్య కోట్ల రూపాయ‌లు మార్కెట్ క‌ల్గిన పెద్ద స్టార్. విక్ర‌మ్ స‌క్సెస్ తో పాన్ ఇండియాలోనూ ఫేమ‌స్ అయ్యాడు. అలాగే ఇటీవ‌ల రిలీజ్ అయిన `రాకెట్రీ` లోనూ సూర్య గెస్ట్ రోల్ పోషించిన సంగ‌తి తెలిసిందే..

ఇందులో సూర్య త‌న రియల్ లైఫ్ పాత్ర‌నే పొషించి ఆక‌ట్టుకున్నాడు. ఇంటర్వ్యూయ‌ర్ గా ఆద్యంతం మెప్పించాడు. విమర్శ‌కుల మెచ్చిన చిత్రంగా రాకెట్రీ నిలిచింది. ఆ ర‌కంగా సినిమా స‌క్సెస్ లో న‌డిప్ప‌న్ నాయ‌గ‌న్ కి చోటు ద‌క్కింది. ఒక‌ ఇటీవ‌లే సూర్య న‌టించిన `ఆకాశ‌మే నీ హద్దురా` ఏకంగా ఐదు విభాగాల్లో జాతీయ అవార్డుల‌నే ఎగ‌రేసుకుపోయిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకి గానూ సూర్య ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకున్నారు. దీంతో సూర్య ఉత్త‌రాది రాష్ర్టాల్లో మ‌రింత ఫేమ‌స్ అవుతున్నాడు. అవార్డులు.రివార్డుల‌తో ఇంటా..బ‌య‌టా హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. తాజాగా `ఆకాశ‌మే నీ హ‌ద్దురా` బాలీవుడ్ లో రీమేక్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సూర్య పోషించిన పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్నారు.

అయినా సూర్య‌ని రీమేక్ వెర్ష‌న్ కూడా వ‌దిలిపెట్ట‌లేదు. ఈ చిత్రంలో గెస్ట్ పాత్ర‌కి న‌డిప్ప‌న్ నాయ‌గ‌న్ సూర్య‌ని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. అక్ష‌య్ అభ్య‌ర్ధ‌న మేర‌కు సూర్య ఒకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. సూర్య‌ని గెస్ట్ గా దించి స‌క్సెస్ అందుకోవాలన్న‌ది అక్ష‌య్ ప్లాన్ గా క‌నిపిస్తుంది.

ఈ సంద‌ర్భంగా సూర్య గ‌త గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇచ్చిన చిత్రాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. `చెన్నైఇల్ ఒరు నాల్`.. `నినాయ్ తాతు యారో`..`క‌డియ కుట్టి సింగం` చిత్రాల్లో గెస్ట్ రోల్స్ తో మెప్పించారు. ఆ సాఇనిమాలు క‌మర్శియ‌ల్ గా కోలీవుడ్ లో పెద్ద విజ‌యాన్ని అందుకున్నాయి. ఆ ర‌కంగా సూర్య గెస్ట్ అప్పీరియ‌న్స్ స‌క్సెస్ సెంటిమెంట్ కి ద‌శాబ్ధాల‌ క్రిత‌మే పునాది ప‌డింద‌ని తెలుస్తుంది.