Begin typing your search above and press return to search.
జాతిరత్నం ఈసారి హిట్టు కొట్టకపోతే కష్టమేనా..?
By: Tupaki Desk | 6 Sep 2022 3:30 AM GMT'పిట్టగోడ' అనే యూత్ ఫుల్ కామెడీ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అనుదీప్ కేవీ. సురేష్ ప్రొడక్షన్స్ దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో వచ్చినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవ్వడంతో దర్శకుడి గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అనుదీప్ కు మరో సినిమా రావడానికి ఐదేళ్లు సమయం పట్టింది.
అయితేనేం రెండో సినిమా కూడా వైజయంతీ మూవీస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో చేసే అవకాశం దక్కించుకున్నాడు అనుదీప్. నవీన్ పొలిశెట్టి - ఫారియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా 'జాతిరత్నాలు' సినిమాని తెరకెక్కించి.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కథ గొప్పగా ఏమీ లేనప్పటికీ.. తనదైన కామెడీ మరియు ప్రధాన పాత్రల చిత్రీకరణతో ఆకట్టుకోగలిగాడు. పాండమిక్ టైం లోనూ జనాలను థియేటర్లకు రప్పించగలిగగాడు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదయ్యేలా చేసాడు. దీంతో మూడో సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ - సురేష్ ప్రొడక్షన్స్ & శాంతి టాకీస్ పతాకాలపై చేసే ఛాన్స్ అందుకున్నాడు.
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ హీరోగా 'ప్రిన్స్' అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అనుదీప్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే దీని కంటే ముందుగా 'ఫస్ట్ డే ఫస్ట్ షో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహించనప్పటికీ.. కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించాడు. తన శిష్యులు వంశీధర్ మరియు లక్ష్మీ నారాయణలకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి.. తను పర్యవేక్షణ చేశాడు. ఈ చిత్రానికి 'జాతిరత్నాలు' ఫార్ములాను రిపీట్ చేశాడు కానీ.. ఈసారి వర్కవుట్ కాలేదు.
'ఫస్ట్ డే ఫస్ట్ షో' లో అతని క్రింజ్ కామెడీని ఆడియన్స్ అంగీకరించలేదు. ఫస్ట్ డే మార్నింగ్ షోకే తిరస్కరించారు. డిఫరెంట్ ప్రమోషన్స్ తో జనాల దృష్టిని ఆకర్షించగలిగాడు కానీ.. పేలవమైన కంటెంట్ తో మెప్పించలేపోయాడు. నెగెటివ్ టాక్ తో పాటుగా విమర్శకులు పూర్ రేటింగ్స్ ఇచ్చారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది.
వాస్తవానికి ‘జాతిరత్నాలు’ సినిమాకి కూడా అనుదీప్ కొన్ని ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఫార్ములాతోనే హిట్టు కొట్టాలని వచ్చి బొక్కబోర్లా పడ్డాడు. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా దర్శకుడు మేల్కోపోతే కష్టమే అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రతిసారీ క్రింజ్ కామెడీ అనేది వర్కౌట్ కాదని అనుదీప్ గ్రహిస్తే మంచిదని సూచిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో 'ప్రిన్స్' సినిమా అతని కెరీర్ కు కీలకమనే చెప్పాలి. ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది కాబట్టి.. ఈ బైలింగ్విల్ తో మంచి విజయ్ హిట్ అందుకోవడం ఎంతో అవసరం. ఒకవేళ ఈసారి కూడా ఎదురుదెబ్బ తగిలితే మాత్రం దర్శకుడి కెరీర్ సందిగ్ధంలో పడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే కామెంట్స్ వస్తున్నాయి. మరి దీపావళికి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.