Begin typing your search above and press return to search.
తేజ.. వాళ్లు బూతులు తిడతారా చూద్దాం..!
By: Tupaki Desk | 1 Nov 2022 3:30 AM GMTఇండస్ట్రీలో వున్న వాళ్లలో ముక్కు సూటిగా మాట్లాడే దర్శకుడు తేజ. కెరీర్ ప్రారంభం నుంచి తనదైన శైలిలో వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తన సినిమాల్లో నటించే నటీనటుల విషయంలో వివాదాస్పదంగా వ్యవహరించి చాలా సందర్భాల్లో వార్తలలో నిలిచారు. కొంత విరామం తరువాత ఆయన తెరకెక్కిస్తున్న మూవీ `అహింస`. భారీ యాక్షన్ సన్నివేశాలతో హింసాత్మక కథతో చేస్తున్న ఈ మూవీ ద్వారా మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ మూవీ ద్వారా డి. సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. త్వరలో ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించిన `పుష్ప` తెలుగులో మాత్రం భారీ నష్టాలని తెచ్చి పెట్టిందని షాకింగ్ విషయాలని వెల్లడించి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిరామ్ గురించి షాకింగ్ గా స్పందించి షాకిచ్చాడు.
దగ్గుబాటి అభిరామ్ ని హీరో అంటూ సంబోధించడం దర్శకుడు తేజకు నచ్చలేదు. ఈ మూవీలో 20 క్యారెక్టర్లు వున్నాయని, అందులో అతనిది ఓ క్యారెక్టర్ అని, అలా కాకుండా డెబ్యూ హీరో అంటూ ఓవర్ చేయకండని తేజ అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తనది అందరితో పాటు సినిమాలో ఓ క్యారెక్టర్ అంతే అని తేల్చేశాడు. ఇక తాను ఉదయ్ కిరణప్ ని పరిచయం చేసినప్పుడు ఉదయ్ కిరణ్ అనే అతన్ని పరిచయం చేస్తున్నానని, నితిన్ ని పరిచయం చేస్తున్నప్పుడు నితిన్ పరిచయం చేస్తున్నానని ప్రత్యేకంగా వారిని పరిచయం చేయలేదన్నారు.
మరి అలాంటిది అభిరామ్ ని ఎందుకు అలా పరిచయం చేయాలన్నాడు. ఎందుకు మీరు ఎక్స్ ట్రా చేస్తున్నారని షాకిచ్చాడు తేజ. అతన్ని మామూలుగానే చూడండి..అన్నాడు. నేను అనుకున్న మంచి కథకు అతని సరిపోయాడు అంతే అని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా రామానాయుడు గారి కోసమే అభిరామ్ తో పని చేశానన్నారు. అది ఎందుకన్నది సినిమా రిలీజ్ తరువాతే చెబుతాను. సినిమాలో 16 యాక్షన్ ఎపిసోడ్ లు వున్నాయని, ఇదొక మాస్ మాసాలా లవ్ స్టోరీ అంటూ చెప్పుకొచ్చాడు.
దగ్గుబాటి ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ గురించి అడిగితే..దగ్గుబాటి ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి ఒకటి ఎక్స్ పెక్ట్ చేస్తున్నారనుకోండి..ఇప్పుడు నేను సినిమా తీశా. సినిమా చూశాక వాళ్లు నన్ను సొగుడ్తారా.. అమ్మనా బూతులు తడతారా అన్నది చూద్దాం` అన్నారు తేజ. అంతే కానీ నేను మాత్రం ఏమీ చెప్పనని, వారి ఇష్టం వచ్చింది చేసుకోవచ్చన్నాడు. ఇక తన సినిమాలో అభిరామ్ హీరో కాదని, జస్ట్ కథలో ఓ పాత్ర మాత్రమేనని చెప్పడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.