Begin typing your search above and press return to search.
తమిళనాడుని షేక్ చేస్తోన్న వెట్రిమారన్ వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 6 Oct 2022 3:27 PM GMTతమిళనాడు రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పుడో అంశం వివాదాస్పంగా మారుతోంది. సోషల్ మీడియా వేదికగా రెండు వర్గాల మధ్య పెద్ద యద్దమే నడుస్తోంది. అందుకు కారకుడు చిత్ర దర్శకుడు వెట్రిమారన్. అతను తీసుకొచ్చినా అంశమే ఇంతటి ఆజ్యకి దారి తీసాందా? అంటే అవుననే వినిపిస్తోంది. ఇటీవలే వెట్రిమారన్ హిందువుల్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
`మన మూలాల్ని మన నుంచి లాగేసుకుంటునే ఉన్నారు. వళ్లువార్ కి కాషాయ రంగు పులమడం.. రాజరాజ చోళ ని హిందు రాజుగా చెప్పడం లాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్య పోస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో రెండు వర్గాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తమిళులు హిందువులు కాదని ఓ వర్గం.. అదే తమీళియన్స్ కి శివుడుని పూజించిన చరిత్ర ఉందని..తమిళులు హిందువులు కాక మరేంటని మరో వర్గం బాహాబాహీకి దిగాయి.
దీంతో #TamilsAreNotHindus అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతుంది. వెట్రిమారన్ వ్యాఖ్యలకు కొందరు మద్దతివ్వగా మరికొంత మంది తిప్పికొడుతున్నారు. విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా వెట్రిమారన్ వ్యాఖ్యల్ని సమర్ధించారు. రాజా రాజ చోళన్ హిందు రాజు కాదని.. హిందు అనేది బ్రిటీషర్ల సృష్టి అని ఉద్ఘాటించారు. ఈ వివాదంలోకి ఇప్పుడు బీజేపీ కూడా దిగింది.
ఆ పార్టీ నేత హెచ్. రాజా వెట్రిమారన్ వ్యాఖ్యల్ని వ్యతిరేకించారు. చరిత్ర గురించి వెట్రిమారన్ కి తెలిసినంత నాకు తెలియదు. కానీ రాజా రాజ చోళన్ రెండు చర్చ్ లు..మయసీదు నిర్మించారు. తనను తాను శివపాద శేఖర్ అని చెప్పుకునేవారు. అలాంటప్పుడు రాజా రాజచోళన్ హిందు ఎందుకు కాకూడదు? అని సందేహం వ్యక్తం చేసారు.
అటు సోషల్ మీడియాలో వార్..మరోవైపు బీజేపీ ఎంట్రీ తో సన్నివేశం రసవత్తరంగతా మారుతోంది. వెట్రిమారన్ వ్యాఖ్యలకు అసలు కారణంగా మణిరత్నం దర్శకత్వం వహించిన `పొన్నియన్ సెల్వన్ పార్ట్ -1` చిత్రం. కల్కీ కృష్ణమూర్తి రంచించిన నవల ఆధారంగా చోళ రాజుల కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా రిలీజ్ అనంతరం వెటమ్రిమారన్ ఈ వ్యాఖ్యలు చేయడంతోనే రగడ మొదలైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.