Begin typing your search above and press return to search.

హీరోల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్న డాక్ట‌ర్!

By:  Tupaki Desk   |   3 May 2022 12:30 AM GMT
హీరోల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టిస్తున్న డాక్ట‌ర్!
X
విష‌యం ఉన్న చిత్రాల‌కే ప్రేక్ష‌కులు పెద్ద పీట వేస్తున్నార‌ని చాలా కాలం క్రిత‌మే ప్రూవ్ అయింది. స్టార్ ఇమేజ్ తో ప‌నిలేకుండా సినిమాలిప్పుడు ప్రేక్ష‌కాద‌ర‌ణ‌కి నోచుకుంటున్నాయి. ఇమేజ్ కేట‌గిరిలో సినిమా ఆడాల‌న్నా మొద‌టి రెండు..మూడు రోజులు త‌ప్ప వారం రోజులు ఆడే సినిమా లేదు. ఇటీవ‌లే విడుద‌లైన ఓ అగ్ర హీరో సినిమా మ‌రోసారి ఆ విష‌యాన్ని రుజువు చేసింది. ఇప్పుడిదే మ్యాట‌ర్ ఓ ముగ్గురు హీరోల్ని టెన్ష‌న్ పెడుతోంది. ఈ మూడు చిత్రాల‌కు పోటీగా ఓ హాలీవుడ్ సినిమా రిలీజ్ అవ్వ‌డంతోనే ఆ ముగ్గురు హీరోల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఓ సారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే..

మే 6న ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 'అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం'..'భ‌ళా తంద‌నాన‌'..'జ‌య‌మ్మ పంచాయ‌తీ'. వీటిలో రెండు సినిమాల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే శ్రీ విష్ణు న‌టించిన 'భ‌ళాతంద‌నాన‌'పై పాజిటివ్ బ‌జ్ ఉంది. చైత‌న్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్..ట్రైల‌ర్ తోనే మంచి హైప్ క్రియేట్ అయింది.

చైత‌న్య మేకింగ్.. యాక్ష‌న్ క‌ట్స్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌నీ..క్రైమ్..ఎమోష‌న్ చుట్టూ సాగే స్టోరీ ఇది. ఈ సినిమాకి పాజిటివ్ బ‌జ్ క‌నిపిస్తుంది. శ్రీ విష్ణు డిఫ‌రెంట్ జానర్ సినిమాల‌కి ఆడియన్స్ బాగానే క‌నెక్ట్ అవుతారు. కాబ‌ట్టి తంద‌నానకి పాజిటివ్ టాక్ వ‌స్తే గ‌ట్టెక్కిన‌ట్లే. మిగతా రెండు సినిమాల సంగ‌తి రిలీజ్ త‌ర్వాత డిసైడ్ చేయాల్సి ఉంది.

ఈ సినిమాలతో ఎలాంటి సంబంధం లేకుండా మే 6న హాలీవుడ్ సినిమా 'డాక్ట‌ర్ స్ర్టేంజ్ మ‌ల్టీ వ‌ర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్' కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా బుకింగ్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆన్ లైన్ లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మొద‌టి మూడు రోజుల బుకింగ్స్ అప్పుడే ఫుల్ అయ్యాయి. వేసవి సెల‌వులు..ఆపై పిల్ల‌ల ఎంట‌ర్ టైనింగ్ మూవీ కావ‌డంతో డాక్ట‌ర్ సినిమా టిక్కెట్ల జోరు కొన‌సాగుతుంది.

ఈ స్పీడ్ కి బ్రేక్ ప‌డాలంటే పై మూడు తెలుగు చిత్రాల్లో ఏదో ఒక‌టైనా స‌క్సెస్ అయితే జ‌నాలు అటు ట‌ర్న్ అయ్యే అవ‌కాశం ఉంది. 'డాక్ట‌ర్' గ‌నుక 'జంగిల్ బుక్ లా' క్లిక్ అయిందంటే పై చిత్రాలు తేలిపోవ‌డం ఖాయం.

ఇప్ప‌టికే థియేట‌ర్లో ర‌న్నింగ్ లో ఉన్ 'ఆచార్య‌'కి అంత పాజిటివ్ టాక్ లేదు కాబ‌ట్టి ఈ సినిమా వాటికి పోటీ కాక‌పోవ‌చ్చు. థియేట‌ర్ల ప‌రంగా 'ఆచార్య' కి ఆక్యుపెన్సీ ఎలాగూ త‌ప్ప‌దన్న సంగ‌తి తెలిసిందే.