Begin typing your search above and press return to search.

ఈయ‌న‌కు చిరంజీవి ఆవేద‌న క‌నిపించ‌లేదా?

By:  Tupaki Desk   |   5 May 2022 1:30 AM GMT
ఈయ‌న‌కు చిరంజీవి ఆవేద‌న క‌నిపించ‌లేదా?
X
ద‌క్షిణాది వెళ్లి ఉత్త‌రాదిని ఒణికిస్తోంది. పాన్ ఇండియా సినిమా అంటే ఇప్పుడు తెలుగు సినిమా లేదా క‌న్న‌డ సినిమా మాత్ర‌మే. ఉత్త‌రాది సినిమాల‌కు సౌత్ లో అంత సినిమా క‌నిపించ‌డం లేదు. దీంతో బాలీవుడ్ గంగ వెర్రులెత్తుతోంది. అస‌లేం జ‌రుగుతోందో అర్థం గాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు ప్ర‌ముఖ స్టార్లు ద‌ర్శ‌క‌నిర్మాతలు.

అదే క్ర‌మంలో ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణాలతో అంత‌ర్జాలంలో డిబేట్లు పుట్టుకొచ్చాయి. ఇక ఉత్త‌రాది సినిమాల ప‌నైపోయింద‌ని సౌత్ పోటీని త‌ట్టుకోలేర‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను మంది పాన్ ఇండియ స్టార్లు కేవ‌లం సౌత్ నుంచి పుట్టుకొచ్చారు. ఇక బాలీవుడ్ లోనూ మీద‌ట వీళ్ల‌దే హ‌వా అని కూడా విశ్లేషిస్తున్నారు.

ప‌నిలో ప‌నిగా ప్ర‌ముఖ బాలీవుడ్ స్టార్ల కుళ్లు కుతంత్రాల‌పైనా నిరంత‌రాయంగా చ‌ర్చ సాగుతోంది. హిందీ ప‌రిశ్ర‌మ‌ను కాచేందుకు ప‌లువురు స్టార్లు చేసిన కామెంట్లు హిస్ట‌రీలో రికార్డ‌య్యాయి. వీటిని ప్ర‌జ‌లు త‌వ్వి తీస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా విశ్లేషిస్తున్నారు. అస‌లు మ‌న మ‌ధ్య ప్రాంతీయ విభేధం లేదా? ప్రాంతాల్ని విడ‌దీసి చూడొద్దా? అంటూ కొంద‌రు సౌతిండియ‌న్ లు ప్ర‌శ్నిస్తున్నారు.

రాజ‌కీయంగా పారిశ్రామికంగా ఆర్థికంగా సౌత్ ఎద‌గ‌కుండా చేసిన ఘ‌న‌త ఉత్త‌రాది నాయ‌కుల‌దేన‌న్న‌ది నిర్వివాదాంశం. కానీ ఇప్పుడు బాలీవుడ్ ప్ర‌ముఖులు ప్రాంతీయ‌త‌ను ఎగ‌దోయొద్ద‌న‌డం విచిత్రంగా ఉంద‌ని విశ్లేషిస్తున్నారు.

అజయ్ దేవగన్ భాషా చర్చపై తాజాగా ప్ర‌ముఖ గాయ‌కుడు సోను నిగమ్ స్పందించారు. ప్రజలను అలాగే దేశాన్ని మరింత విభజించవద్దు అని కోరాడు. కొద్దిసేపటి క్రితం రన్‌వే 34 నటుడు అజయ్ దేవగన్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో సౌత్ స్టార్ కిచ్చా సుదీప్ తో వాగ్వాదానికి దిగాడు. తమిళం జాతీయ భాషగా ఉండాలని ఆ తర్వాత చేసిన వ్యాఖ్య గురించి దేవ‌గ‌న్ స్పందించాడు. కిచ్చా వ్యాఖ్య‌ల‌ను సరిదిద్దుతూ హిందీ నిజానికి జాతీయ భాష అని దేవగన్ స్పందించారు. అయితే ఇద్దరూ తమ విభేదాలను పరిష్కరించుకోగా దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు FICCI ఫ్లో కోసం ఒక కార్యక్రమంలో గాయకుడు సోను నిగమ్ భాషా చర్చపై అతని అభిప్రాయాల గురించి ప్రశ్నించారు. ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ.. అత‌డు ఇలా అన్నాడు. ''ప్రజలను దేశాన్ని మరింత విభజించవద్దు అని నిగమ్ అన్నారు.

సోనూ నిగమ్ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ,- "మొదట హిందీ మన జాతీయ భాష అని భారత రాజ్యాంగంలో ఎక్కడా రాసార‌ని నేను అనుకోను. నాకు తెలిసినంత వరకు నేను అడిగిన నిపుణుల స‌మాచారం మేర‌కు ఎక్కడా ఇది రాయ‌లేదు. కానీ ఎక్కువగా మాట్లాడే భాష హిందీ. తమిళం ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష అని మనకు తెలుసు కదా.. సంస్కృతం .. తమిళం మధ్య చర్చ జరుగుతోంది. ఇప్పుడు మన స్వంత దేశంలోనే సమస్యలను లేవనెత్తాలనుకుంటున్న ఇతర దేశాలతో మనం తక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నామా? ఇలా ఎందుకు చేయాలి? ఈ చర్చలు ఎందుకు? వర్గీకరణ ద్వారా మీ దేశంలోనే శత్రువులను ఎందుకు తయారు చేసుకోవాలి? ప్రజలను ఏ భాషలోనైనా మాట్లాడనివ్వండి.. చల్లగా హాయిగా ఉండనివ్వండి. మన న్యాయస్థానాలు ఇంగ్లీషులో తీర్పు ఇస్తాయి.

విమానాలలో ఎయిర్ హోస్టెస్ ఇంగ్లీషులో మాట్లాడుతుంది. వారికి హిందీ రాదు. ఇంగ్లీషు మన సంస్కృతిలో భాగమైపోయింది. దీన్ని మనం అంగీకరించాలి. ఈ దేశంలో ప్రజలను విభజించవద్దు. పరిష్కరించడానికి ఇప్పటికే బోలెడ‌న్ని సమస్యలు ఉన్నాయి. మ‌న‌కు మరిన్ని అవసరం లేదు.. అని సోను నిగ‌మ్ వ్యాఖ్యానించారు.

'హిందీ ఇకపై భారత జాతీయ భాష కాదు' అంటూ కిచ్చా సుదీప్‌ ట్వీట్‌ చేయడంతో భాషా చర్చ మొదలైంది. అదే విషయంపై దేవగన్ స్పందిస్తూ,- "నా సోదరా మీ ఉద్ధేశం ప్రకారం హిందీ మన‌ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తారు? హిందీ మన మాతృభాష - జాతీయ భాష ఎప్పటికీ.. చాలాకాలంగా అలాగే ఉంది .. ఎల్లప్పుడూ ఉంటుంది... అని అన్నాడు.

అయితే అజయ్ దేవగన్ ఈ పోస్ట్ చేయడంతో ఇద్దరూ తమ సమస్యలను త్వరలోనే పరిష్కరించుకున్నారు. అపార్థాన్ని తొలగించినందుకు ధన్యవాదాలు. నేను ఎప్పుడూ సినిమా పరిశ్రమను ఒక్కటిగానే భావిస్తాను. మేము అన్ని భాషలను గౌరవిస్తాము. ప్రతి ఒక్కరూ మన భాషను కూడా గౌరవించాలని మేము ఆశిస్తున్నాము.. అని ఒక‌రికొక‌రు స‌ర్ది చెప్పుకున్నారు. ఇక అనంత‌రం దీనిపై అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ డిబేట్ మొద‌లైంది. ఇంత‌కుముందు సుహాసిని కూడా త‌న అభిప్రాయం వ్య‌క్తం చేసారు.

అదంతా స‌రే కానీ.. ఈ భాషా డిబేట్ వ‌రకూ మ‌న‌మంతా ఒక‌టే అని అంటున్నారు. కానీ అభివృద్ధి విష‌యంలో ఎప్పుడూ సౌత్ ని దూరం పెడుతూనే ఉన్నారు నాయ‌కులు. వారిని స‌రిదిద్దేది ఎప్ప‌టికో ఎవ‌రికీ అర్థం కాదు. ఇంత‌కుముందు మెగాస్టార్ చిరంజీవి ఉత్త‌రాదిన ఎన్టీఆర్ - ఏఎన్నార్ వంటి లెజెండ్స్ కి అవ‌మానం జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఆరోజుల్లో సౌత్ నుంచి స్టార్లుగా వారిని స‌ముచితంగా గౌరవించ‌లేద‌ని రాజ‌ధాని దిల్లీ సాక్షిగా అవ‌మానించార‌ని చిరు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. దీనిపై ఇప్ప‌టికీ తెలుగు ప్ర‌జ‌ల్లో డిబేట్ సాగుతోంది. ఉత్త‌రాది జాత్యాహంకారం ఎప్పుడూ ఉంది. ఇప్పుడు తక్కువేమీ లేదు. మ‌న సినిమా ఎదుగుద‌ల‌ను వారు ఎప్ప‌టికీ స్వాగ‌తించ‌డం లేదు. అయితే దేశం అంతా ఒక్కటే అనుకుంటే ఇలా ఎందుకు జ‌రుగుతుంది? మ‌న తెలుగు క‌న్న‌డ సినిమాల్ని పాన్ ఇండియా సినిమాలు అని ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ ప్ర‌క‌టించాలి. అక్క‌డ స్టార్లు త‌మ ఓట‌మిని అంగీక‌రించాలి. ఈగోకు పోకుండా చ‌ర్చ‌ల‌కు రావాలి. దేశ స‌మ‌గ్ర‌త విష‌యంలో అంద‌రూ ఐక్యం కావాలి. కానీ కొన్నిటిని ఈగో వ‌దిలేసి అంగీక‌రించాలి.