Begin typing your search above and press return to search.

హ‌ను ఈ సారైనా కొడ‌తాడా?

By:  Tupaki Desk   |   25 July 2022 5:30 PM GMT
హ‌ను ఈ సారైనా కొడ‌తాడా?
X
`అందాల రాక్ష‌సి` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు హ‌ను రాఘ‌వ‌పూడి. ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఆయ‌న తొలి చిత్రంతోనే మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. రానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో మాత్రం స‌క్సెస్ ని అందించ‌లేక‌పోయింది. అనుకున్న క‌థ‌ని అనుకున్న వేలో ప్ర‌జెంట్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే స‌రైన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింద‌ని ఇప్ప‌టికి కామెంట్ లు వినిపిస్తుంటాయి.

అయితే ఈ మూవీ త‌రువాత హ‌ను రాఘ‌వ‌పూడి చేసిన కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ‌`,ల లై చిత్రాల‌కు కూడా అదే ప్ర‌ధాన లోపంగా నిలిచింది. దీంతో ఈరెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌లేక‌పోయాయి. ఇక వీటి త‌రువాత ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీగా హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన మూవీ `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు`. శ‌ర్వానంద్ , సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించారు.

ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. దీని కోసం నిర్మాత భారీగానే ఖర్చు చేశారు కూడా. నేపాల్‌ నేప‌థ్యంలో సాగే ల‌వ్ స్టోరీగా ఈ మూవీని రూపొందించారు. మ‌ధ్య‌లో భూకంపం క‌థ‌ల‌ని మ‌లుపులు తిప్ప‌డంతో క‌థ‌లో వున్న ఫీల్ మొత్తం పోయింది. దీంతో నిర్మాత‌కు ఈ మూవీ భారీ న‌ష్టాల‌ని తెచ్చిపెట్టింది. క‌ష్టాల్లోకి నెట్టేసింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఇదొక ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ అని ద‌ర్శ‌కుడు చెప్పుకొచ్చాడు.

కానీ ఫ‌లితం మాత్రం ఇందుకు భిన్నంగా రావ‌డం గ‌మ‌నార్హం. ఇదే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ `సీతారామం`. `యుద్ధంతో రాసిన ప్రేమ‌లేఖ‌` అనేది ఉప‌శీర్షిక‌. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్ పై వైజ‌యంత్రీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఆగ‌స్టు 5న భారీ స్థాయిలో తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌లయాళ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్బంగా మేక‌ర్స్ సోమ‌వారం ఈ మూవీ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ద‌ర్శ‌కుడు సినిమా గురించి వ‌ర్ణించిన తీరు నెట్టింట వైర‌ల్ గా మారింది. బాగా వ‌ర్షం వ‌చ్చిన‌ప్పుడు వేడి వేడి కాఫీ తాగిన ఫీలింగ్ ని క‌లిగిస్తుంద‌ని, ఎండా కాలం చ‌ల్ల‌ని వాట‌ర్ తాగిన‌ట్టుగా వుంటుంది.. `అందాల రాక్ష‌సిని`ని మించి వుంటుంది. ఈ మూవీ విష‌యంలో నేను చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను. ఈ సినిమా చూస్తూ మిమ్మ‌ల్ని మీరు మ‌ర్చిపోతారు. సీతారామంతో క‌లిసిపోతార‌ని రాసిస్తాను. థియేట‌ర్లో సినిమా చూశాక సినిమా మీతో పాటు మీ వెంటే వ‌చ్చేస్తుంది. మీతో పాటు ప‌డుకుంటుంది.. మీతో పాటే ప‌డుకుంటుంది...మీ పెద్ద వాళ్లు కొన్ని సినిమాల గురించి మీతో చెప్పిన‌ట్టే మీరు ఏజ్ ప‌డ్డాక మీ వాళ్ల‌తో ఈ సినిమా గురించి చెబుతారు. ఇది నా గ్యారంటీ!.` అంటూ చెప్పుకొచ్చారు.

ఈ స్పీచ్ విన్న వాళ్లంతా చాలా అతిగా వుంద‌ని కామెంట్ లు చేస్తున్నారు. `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు` టైమ్ లో ఇదే స్థాయిలో చెప్పిన హ‌ను రాఘ‌వపూడి బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్ అయ్యాడ‌ని, ప్ర‌స్తుతం `సీతారామం` విష‌యంలో అయినా గట్టిగా కొడ‌తాడా? అని కామెంట్ లు చేస్తున్నారు. ద‌ర్శ‌కుడి స్పీచ్ మాత్రం ఎక్క‌డో కొడుతోంద‌ని, కాన్ఫిడెంట్ వుండొచ్చు కానీ మ‌రీ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ క‌నిపిస్తోంద‌ని నెటిజ‌న్ లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.