Begin typing your search above and press return to search.

సిటాడెల్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

By:  Tupaki Desk   |   29 April 2023 9:41 AM GMT
సిటాడెల్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
X
ఇండియన్ హాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా తాజా సిటాడెల్ వెబ్ సిరీస్ తో అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. హాలీవుడ్ లో రూసో బ్రదర్స్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కి ముందుగానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. రిచర్డ్ మ్యాడిన్, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో వచ్చిన ఈ స్పైస్ థ్రిల్లర్ హాలీవుడ్ తో పాటు ఇండియన్ భాషలలో కూడా రిలీజ్ అయింది.

స్టార్ హీరోయిన్ గా ప్రియాంక చోప్రాకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కి విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్లుగానే టీమ్ కూడా గట్టిగా ప్రమోట్ చేశారు. ఈ సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో సమంత, వరుణ్ ధావన్ నటించబోతున్నారు. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.

ఇక ఒరిజినల్ వెర్షన్ సిటాడెల్ టాక్ ఎలా ఉందో చూసుకుంటే మెజారిటీ ఆడియన్స్ పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ సిరీస్ లో ప్రియాంక చోప్రా పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉందని ప్రశంసిస్తున్నారు. అలాగే హీరో రిచర్డ్ మ్యాడిన్ నటన కూడా అద్భుతంగా ఉందని పొగుడుతున్నారు. మొదటి రెండు ఎపిసోడ్స్ టాప్ నాచ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

హీరో రిచర్డ్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసాడంట. అలాగే ఎపిసోడ్స్ తక్కువ నిడివితో చాలా ఫాస్ట్ గా సాగిపోయే కథనంతో ఆసక్తికరంగా ఉన్నాయంటూ రివ్యూలు రాస్తున్నారు. స్టైలిష్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ కొత్తగా ఉన్నాయంట. స్టోరీ విషయంలో ఇంకాస్తా బెటర్ గా ఆలోచిస్తే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఈ వెబ్ సిరీస్ కథలోకి వెళ్తే సిటాడెల్ అనే స్పై ఏజెన్సీ ప్రపంచ దేశాల భద్రత కోసం ప్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. అందులో నదియా సిన్హా(ప్రియాంక చోప్రా) మేసన్ కేన్(రిచర్డ్ మ్యాడిన్) కీలకమైన ఏజెంట్స్ గా ఉంటారు. అయితే కొంతమంది సంపన్నులు సిటాడెల్ ని నాశనం చేయడమే ద్యేయంగా మరో స్పై ఏజెన్సీని స్టార్ట్ చేశారు.

ఈ రెండింటి మధ్య నడిచే ఎత్తులు, పై ఎత్తులు పోరాటాలతో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. హాలీవుడ్ లో ఇలాంటి కథలు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. అయితే ఇండియన్ ఆడియన్స్ కి ప్రియాంక చోప్రాని యాక్షన్ హీరోయిన్ గా చూడటం కాస్తా ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తుంది. ప్రేక్షకుల రివ్యూ ప్రకారం ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్ సీక్వెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం కచ్చితంగా చూడొచ్చు అనే మాట వినిపిస్తోంది.