Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్30 : బోర్డర్ దాటుతానంటూ కొరటాల కామెంట్స్
By: Tupaki Desk | 26 April 2022 6:31 AM GMTనందమూరి అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఎన్టీఆర్30. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేయబోతున్న ఈ సినిమా జూన్ నెలలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలు అయ్యిందని సమాచారం అందుతోంది.
గత ఏడాదిలోనే సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కాని కరోనా వల్ల ఆచార్య మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాలు విడుదల వాయిదా పడుతూ వచ్చాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కాలం పాటు కష్టపడ్డాడు. ఇటీవలే ఆ సినిమా విడుదల అయ్యి ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే.
ఇక ఆచార్య సినిమా ఎప్పుడో పూర్తి అయినా కూడా సరైన సమయం కోసం వెయిట్ చేసి ఈ వారంలో విడుదల చేయబోతున్నారు. ఆచార్య సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అపజయం అంటూ ఎరగని కొరటాల శివ కచ్చితంగా ఆచార్య తో కూడా బ్లాక్ బస్టర్ దక్కించుకుంటే ఎన్టీఆర్ 30 సినిమా ఆకాశమే హద్దు అన్నట్లుగా అంచనాలు పెరగడం ఖాయం.
ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభం అవ్వబోతున్నాయి అనే విషయంలో ఇటీవలే స్పష్టత ఇచ్చిన కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ 30 సినిమా ఎలా ఉండబోతుందని 'ఆచార్య' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కొరటాలను అడిగిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి.
ఇంతకు కొరటాల ఏమన్నాడంటే... ఈసారి కొంచెం మిర్చి కంటే ఎక్కువ ఓవర్ డోస్ ఆఫ్ ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. జనతా గ్యారేజ్ సమయంలోనే నేను చెప్పాను. ఈ ఒక్క సినిమా కావాలని ఇలా చేస్తున్నాను. తర్వాత సినిమా మాత్రం ఫుల్ కమర్షియల్ హైప్ ఉండే చేస్తాను అని చెప్పాను. చాలా పెద్ద కథ రాశాయి.. వెరీ ఎమోషనల్ హైప్స్.. కమర్షియల్ హైప్ ఉన్న ఫిల్మ్ ఇది అన్నాడు.
ఇది ఒక పెద్ద కథ కాబట్టి తప్పకుండా బిగ్గర్ ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. ఈసారి కచ్చితంగా బోర్డర్ దాటుతాము. పెద్ద స్టార్ ను పెట్టుకున్నప్పుడు పెద్ద కథ రాశాను. కనుక చాలా మంది ఆడియన్స్ కు రీచ్ అయ్యే విధంగా సినిమాను తీస్తాను అన్నట్లుగా కొరటాల శివ చెప్పుకొచ్చాడు.
ఆయన మాటలను బట్టి తప్పకుండా ఈసారి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ ను దక్కించుకోబోతున్నాం అంటూ ఎన్టీఆర్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. చాలా స్పీడ్ గా ఎన్టీఆర్ 30 సినిమాను చేస్తానంటూ కొరటాల శివ మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.