Begin typing your search above and press return to search.
నార్త్ బాయ్ కాట్ అంటే సౌత్ సపోర్ట్ గా చేస్తోంది!
By: Tupaki Desk | 7 Aug 2022 1:30 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ `లాల్ సింగ్ చడ్డా`. హాలీవుడ్ లో టామ్ హంక్స్ నటించిన `ఫారెస్ట్ గంప్` కు రీమేక్ గా ఈ మూవీని రూపొందించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో మాజీ భార్య కిరణ్ రావుతో కలిసి నిర్మించారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ద్వారా టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో రిలీజ్ చేస్తున్నారు.
ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. `థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్` ఫ్లాప్ కావడంతో అమీర్ `లాల్ సింగ్ చడ్డా`పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం తెలుగు మార్కెట్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవిని సమర్పకుడిగా ఈ ప్రాజెక్ట్ రిలీజ్ కు తెలుగులో అసోసియేట్ చేయడాన్ని బట్టే అమీర్ తెలుగు మార్కెట్ కు ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నాడో స్పష్టమవుతోంది.
ఇక ఈ విషయాన్నినాగార్జున ప్రత్యేకంగా అమీర్, చిరు, చైలని ఇంటర్వ్యూ చేయడం స్పష్టం చేసింది. ఇదిలా వుంటే ఈ మూవీ నార్త్ లో తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటోంది. చాలా దారుణంగా అమీర్ తో పాటు `అల్ సింగ్ చడ్డా`ని నెటిజన్ లు ట్రోల్ చేస్తున్నారు. బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ నెట్టిట హ్యాష్ ట్యాగ్ లతో ప్రచారం చేస్తున్నారు. కొంత మంది థియేటర్ల వద్దకు వెళ్లి మరీ అమీర్ సినిమాని ఎందుకు బాయ్ కాట్ చేయాలనుకుంటున్నారని ప్రశ్నిస్తూ ఆ వీడియోలని నెట్టింట వైరల్ చేస్తున్నారు.
నార్త్ బెల్ట్ లో మరీ ముఖ్యంగా హర్యానా, పంజాబ్ ప్రావిన్స్ లోని పలు రూరల్ ఏరియాల్లో `లాల్ సింగ్ చడ్డా` పై తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతోంది. సినిమా రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతున్నా కొద్దీ నార్త్ లో అమీర్ ఖాన్ సినిమాపై వ్యతిరేకత పెరిగిపోతోంటే సౌత్ లోని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంత కంతకు పాజిటివిటీ పెరిగిపోతోంది. సౌత్ రీజియన్ లోనూ అమీర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుండటం విశేషం.
బీజేపీకి చెందిన కొంత మంది విజయశాంతి లాంటి లీడర్లు తప్ప ఈ మూవీని సౌత్ లో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యతిరేకించే వారు కనిపించకపోవడం గమనార్హం. 2015లో ఓ సందర్భంగాలో అమీర్ అన్న మాటలు ఇప్పడు `లాల్ సింగ్ చడ్డా`కు నార్త్ లో తీవ్ర ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అసహనం పెరిగిపోయిందని, తన వైఫ్ దేశం విడిచి వెళ్లిపోదామని అంటోందని అమీర్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.