Begin typing your search above and press return to search.
మైత్రీ నిర్మాతలని దెబ్బేసిన ఆ మూడు సినిమాలు
By: Tupaki Desk | 10 April 2023 11:00 PM GMTటాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థగా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్. శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ తరువాత వరుసగా భారీ ప్రాజెక్ట్స్ ని నిర్మిస్తూ వచ్చారు. ముఖ్యంగా స్టార్ హీరోలతోనే ఈ ప్రొడక్షన్ హౌస్ సినిమాలు నిర్మిస్తూ ఉండటం విశేషం.
అయితే అప్పుడప్పుడు లోబడ్జెట్ సినిమాలలో కూడా భాగస్వామ్యం అవుతూ తమ సమర్పణలో రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అనే బ్రాండ్ ఉంటే ఆటోమేటిక్ గా మూవీకి హైప్ వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కొన్ని చిన్న సినిమాలకి నిర్మాణ భాగస్వామిగా మైత్రీ నిర్మాతలు ఉంటున్నారు. ఇలా ఈ ప్రొడక్షన్ హౌస్ సమర్పణలో ఈ మధ్యకాలంలో వచ్చిన చిన్న సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకొని కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాబట్టలేకపోయాయి.
లావణ్య త్రిపాఠి డ్యూయల్ రోల్ లో నటించిన హ్యాపీ బర్త్ డే మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రిలీజ్ చేశారు. డార్క్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. సుదీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ లోనే రిలీజ్ చేశారు.
సినిమా ప్రమోషన్ కోసం కూడా భాగానే ఖర్చు పెట్టారు. అయితే రిలీజ్ తర్వాత మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కనీసం థియేటర్స్ రెంట్ కూడా రాబట్టలేకపోయింది. తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా మీటర్ అనే కమర్షియల్ చిత్రాన్ని మైత్రీ ద్వారానే రిలీజ్ చేశారు. ఈ మూవీ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఈ సినిమాలు కనీసం రిలీజ్ ఖర్చులని కూడా రాబట్టాకపోగా ఇంకా నిర్మాతలకి అదనంగా నష్టాలు తీసుకొచ్చాయి. మీటర్ మూవీ అయితే జీరో షేర్ మూవీగా మారిపోయింది. మొత్తానికి మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వచ్చిన ఈ చిన్న చిత్రాలు మూడు కూడా ఆర్ధికంగా వారికి భారీ నష్టాలు తీసుకొచ్చాయని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.