Begin typing your search above and press return to search.

స్నేహితురాలి బుగ్గ‌ని అంత‌గా జుర్రేయాలా?

By:  Tupaki Desk   |   19 April 2022 7:30 AM GMT
స్నేహితురాలి బుగ్గ‌ని అంత‌గా జుర్రేయాలా?
X
ర‌ణ‌బీర్ క‌పూర్-అలియాభ‌ట్ దంప‌తుల‌కు విషెస్ చెప్ప‌డానికి బాలీవుడ్ మొత్తం క‌దిలిన సంగ‌తి తెలిసిందే. పెళ్లైన‌ సంద‌ర్భంగా జంట‌ని ఆశీర్వదించి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అందుబాటులో ఉన్న వారంతా నేరుగా అలియా-ర‌ణ‌బీర్ని క‌లిసి విష్ చేసారు. అలాగే ఖ‌రీదైన పెళ్లి కానుక‌లు అందించారు. అందుబాటులో లేని వారంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలిపారు. బ‌హుమ‌తులు ఆన్ లైన్ సేవల‌ ద్వారా నేరుగా ఇంటికే వ‌చ్చేసాయి.

అయితే ఇలా విషెస్ చెప్ప‌డానికి వ‌చ్చిన అలియాభ‌ట్ క్లోజ్ ప్రెండ్ తాన్య షాహాకి పెద్ద షాక్ ఇచ్చాడు ర‌ణ‌బీర్. కొత్త దంప‌త‌లుకు విషెస్ చెప్పిన అనంత‌రం ఫోటో కోసం తాన్యా ర‌ణ‌బీర్ -అలియాభ‌ట్ మ‌ధ్య‌లోకి వ‌చ్చింది. ఇంత‌లోర‌ణ‌బీర్ తాన్యా న‌డుంపై చేయి వేసి బుగ్గ కందిపోయేలో ముద్దు పెట్టాడు. మ‌రి ఈ సీన్ ని అలియా చూసిందో ? లేదో తెలియ‌దు గానీ...అలియాభ‌ట్ మాత్రం అప్పుడు కెమెరా వైపు చూస్తూనే క‌నిపించింది.

తాన్యా సాహి ఆస‌మ‌యంలో కాస్త అసౌక‌ర్యంగా ఫీలైన‌ట్లు క‌నిపిస్తుంది. ర‌ణ‌బీర్ సడెన్ గా ఇలా ట్విస్ట్ ఇవ్వ‌డంతోనే అలా జ‌రిగి ఉండొచ్చు. ప్ర‌స్తుతం ఈఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గామారింది. ఈఫోటోపై- కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం. అలియా బెస్ట్ ప్రెండ్ ని ర‌ణ‌బీర్ ఎందుకు ముద్దాడిన‌ట్లు? అత‌ని స్నేహితురాలినో..స్నేహితుడినో ర‌ణ‌బీర్ ముద్దుడినా ఓ అర్ధం ఉంది.

అలాంటింది అలియా ప్రెండ్ పై ఆ దాడి ఏంటి? అంటూ సోష‌ల్ జ‌నాలు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని త‌ప్ప‌కుండా అలియా మైండ్లో పెట్టుకుంటుంది. ర‌ణ‌బీర్ కి ఏ స‌మ‌యంలో స‌మాధానం చెప్పాలో అప్పుడే అలియా భ‌ట్ స‌రైన బ‌దులిస్తుంద‌ని ఓ అభిమాని కామెంట్ పెట్టింది. అలాగే ర‌ణ‌బీర్ ని తాన్య న‌డుంపై చేయి వేయ‌డంపైనా నెగిటివిటీ స్ర్పెడ్ అవుతుంది.

ఎలాంటి వ‌స్ర్తాలు లేని తాన్యా అంద‌మైన న‌డుంపై అంత‌లా చేయి వేయాలా? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి రాక్ స్టార్..మ‌రోసారి రొమాంటిక్ స్టార్ అని నిరూపించాడుగా. పెళ్లిలో సైతం ర‌ణ‌బీర్ ట్యాలెంట్ చూపించే ప్ర‌య‌త్నం చేసాడు.

మ‌రి పెళ్లి వీడియో మొత్తం బాగా ప‌రిశీలిస్తే ఇలాంటి రొమాంటిక్ స‌న్నివేశాలు ఇంకెన్ని దొరుకుతాయో. అయితే సెల‌బ్రిటీల్లో ఇవ‌న్నీ స‌హ‌జం. వాటిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఆప్యాయంగా కౌగిలించుకోవ‌డం..పెద‌వి ముద్దులు పెట్టుకోవ‌డం వంటివి స్నేహ‌బావాన్ని..వారి మ‌ధ్య ఉన్న బాండింగ్ ని తెలియ‌జేస్తుంటాయి.