Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌31.. మైత్రి వారు ఆగేలా లేరు

By:  Tupaki Desk   |   5 May 2022 11:30 PM GMT
ఎన్టీఆర్‌31.. మైత్రి వారు ఆగేలా లేరు
X
ఎన్టీఆర్‌ ఇటీవలే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఎన్టీఆర్ 30 సినిమా గా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొరటాల శివ ఇప్పటికే ఎన్టీఆర్‌ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా ముగించాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్‌ 31 సినిమాకు సంబంధించిన విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఎన్టీఆర్‌ సినిమాల లైనప్‌ చాలా పెద్దగా ఉంది. కొరటాల.. ప్రశాంత్ నీల్.. బుచ్చి బాబు తో పాటు ఇంకా పలువురు ప్రముఖ దర్శకులు కూడా ఎన్టీఆర్ తో సినిమాను చేసేందుకు లైన్ లో ఉన్నారు. అయితే ఆర్డర్ ఏంటీ అనే విషయంలో మాత్రం మెల్ల మెల్లగా క్లారిటీ వస్తుంది. వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను ఎన్టీఆర్‌ చేయబోతున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ఎన్టీఆర్‌ 31 ఉండబోతుంది.

ఈ నెలలో ఎన్టీఆర్‌ పుట్టిన రోజు రాబోతుంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజున నందమూరి అభిమానులకు పండుగ అనడంలో సందేహం లేదు. ఆ రోజున ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల మరియు ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాల పోస్టర్ లు అప్‌డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ 31వ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ తో పాటు ఒక కాన్సెప్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేయబోతున్నారట. ఎన్టీఆర్ 30 ప్రారంభం కాకుండానే ఎన్టీఆర్‌ 31 పోస్టర్ విడుదలకు ఎన్టీఆర్‌ ఆసక్తిగా లేడట.. కాని మైత్రి వారు మాత్రం ఆగేలా లేరు.

మైత్రి వారు ఇలాంటి స్పెషల్స్ ఇవ్వడంలో ఎప్పుడు ముందు ఉంటారు. ఆమద్య ప్రశాంత్‌ నీల్‌ పుట్టిన రోజు అయితేనే సోషల్‌ మీడియాలో హడావుడి చేశారు. వారి బ్యానర్‌ లో నటిస్తున్న హీరోల అందరి పుట్టిన రోజులు లేదా స్పెషల్‌ డేస్‌ ను మైత్రి మూవీస్‌ వారు ప్రత్యేక పోస్టర్స్ తో సెలబ్రేట్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్‌ 31 సినిమా గురించి ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు. ఆ క్లారిటీని పుట్టిన రోజు సందర్బంగా ఇవ్వబోతున్నారు.

ఎన్టీఆర్ కు మైత్రి వారు ఇవ్వబోతున్న ప్రత్యేక బర్త్‌ డే స్పెషల్‌ బహుమానం ఏంటీ అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవలే ప్రశాంత్‌ నీల్ కేజీఎఫ్ 2 తో వెయ్యి కోట్ల వసూళ్లను క్రాస్ చేయడం మాత్రమే కాకుండా ఆర్‌ ఆర్ ఆర్‌ వసూళ్లను సైతం బీట్‌ చేశాడు.

కనుక ఎన్టీఆర్‌ ఆయన దర్శకత్వంలో నటిస్తున్న కారణంగా ఆసక్తి ఉంది. అది మైత్రి మూవీ మేకర్స్ వారు మరింతగా పెంచేలా పోస్టర్ ను ఈ బర్త్‌ డే కు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక కొరటాల శివ మూవీ కాన్సెప్ట్‌ పోస్టర్ లేదా అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఎన్టీఆర్ బర్త్‌ డే కు అభిమానులకు పోస్టర్స్ తో సందడే సందడి.