Begin typing your search above and press return to search.
పూరి టార్గెట్ కుర్ర హీరోలేనా?
By: Tupaki Desk | 5 Nov 2022 6:30 AM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తాజా పరిస్థితిని పక్కనబెడితే! పూరి టార్గెట్ మాత్రం యంగ్ హీరోలేనని చెప్పాల్సిన పనిలేదు. అతను దర్శకుడైన కొత్త లో సీరియర్ నటుడు కింగ్ నాగార్జున తో మాత్రమే రెండు సినిమాలు చేసారు. సూపర్..శివమణి చేసి సక్సెస్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత కింగ్ సహా మరే ఇతర హీరోవైపు చూసింది లేదు.
యూత్ ఫుల్ స్టోరీల్ని యంగ్ హీరోలతోనే తెరకెక్కించారు. కేవలం మార్కెట్ ఉన్న స్టార్లతోనే సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో పూరి కెరీర్ గ్రాఫ్ అప్ అండ్ డౌన్స్ గానే కనిపిస్తుంది. ఒకే వేలో సక్సెస్ లు అందుకుంది లేదు. అదే వేలో అపజయాలు చవి చూసింది లేదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసి ముందుకు సాగాడు. అయితే ఇప్పుడా బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తుంది.
`లైగర్` పరాభవం అతన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టిందో కళ్లముందు కనిపిస్తూనే ఉంది. బయ్యర్లు నానా యాగీ చేయడం..ప్రతిగా పూరి కౌంటర్ వేయడం లాంటి సీన్ పూరి కెరీర్ లో ఇంత వరకూ ఫేస్ చేసింది లేదు. గతంలోనూ పరాజయాలు ఎదురయ్యాయి. కానీ మీద పడి ఒత్తిడి చేసేంత సీన్ ఏ సినిమా విషయంలో కనిపించలేదు.
`లైగర్` తర్వాత కొత్త పూరిని చూస్తారు. పూరి కథల విధానం మారుతుంది. నెమ్మది గా సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు గానీ...లైగర్ తో నైశార్యమే కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితిని పూరి ఎలా అధిగమిస్తాడు? అన్నది పక్కనబెడితే! పూరి టార్గెటెడ్ హీరోలు మాత్రం అవకాశం ఇవ్వడం కష్టమేనని సంకేతాలు అందుతున్నాయి.
ఇప్పటికే ఓ సెక్షన్ హీరోలు అతన్ని దూరం పెడుతున్నట్లు వినిపిస్తుంది. మీడియం రేంజ్ హీరోలు కూడా అతన్ని నమ్మడం కష్టంగా మారుతోంది అన్న ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే పూరి ఆప్షన్ గా సీనియర్ హీరోల్ని చూజ్ చేసుకోవాల్సిందే. అందులోనూ కొందరు సెలక్టడ్ హీరోలు మాత్రమే నమ్మి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
మెగాస్టార్ చిరంజీవితో పూరి కి మంచి ర్యాపో ఉంది. కానీ అవకాశం ఇచ్చేంత ఉందా? అంటే డౌటే. ఇక బాలయ్య అయితే పూరి పై ప్రాణం పెట్టేస్తారు . కథ కూడా వినకుండా ఇచ్చేంత ప్రేమ పూరి పై కురిపిస్తారాయన. ఇప్పటికే బాలయ్యతో `పైసా వసూల్` చేసిన సంగతి తెలిసిందే. అలాగే విక్టరీ వెంకటేష్ తో పూరి ఇంత వరకూ సినిమా చేయలేదు. సరైన కథతో మెప్పించగల్గితే అక్కడా ఛాన్స్ ఉంది. అలాగే నాగార్జున కూడా మంచి స్నేహితుడు. అతను కూడా పూరి ని కాదనలేరు. మరి పూరి బాణం దిశను మార్చి వదలగల్గితే వీళ్లంతా క్యూలో ఉంటారు. మరి పూరి మనసు ఏం కోరుకుంటుందో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.