Begin typing your search above and press return to search.
పేరుకే లేడీ స్టార్స్.. ఆ విషయంలో జీరో
By: Tupaki Desk | 20 Jun 2022 5:07 AM GMTసినిమా పరిశ్రమలో మగవాళ్లదే అగ్ర తాంబూలం. ప్రతి విషయంలో కూడా మగవాళ్లకే ప్రాముఖ్యత ఎక్కువ అనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. హీరోల పారితోషికాలు వందల కోట్లలో ఉంటున్న ఈ సమయంలో హీరోయిన్స్ పారితోషికం మూడు నాలుగు కోట్లు తీసుకుంటేనే గొప్ప విషయం అన్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు వరుసగా వస్తున్నాయి.
హీరోయిన్ ల్లో కొందరు వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నయనతార వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయడం తో ఆమెకు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును అభిమానులు ఇచ్చారు. నయనతార తర్వాత సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అంటూ అభిమానులు బిరుదు ఇచ్చారు. సౌత్ లో కొందరు స్టార్ హీరోయిన్స్ కు సోషల్ మీడియా మరియు బయట స్టార్ హీరోల స్థాయిలో ఫాలోయింగ్ ఉంది.
సాయి పల్లవికి ఈమద్య కాలంలో పెరిగిన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో సాయి పల్లవి ని అభిమానించే వారు మెజార్టీ సంఖ్య ఉంటుంది. అలాంటి సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.. అందరూ అభిమానించే సాయి పల్లవి సినిమాలో బాగా చేసిందనే టాక్ కూడా వచ్చింది.
విరాటపర్వం గురించి అంతా పాజిటివ్ గా ఉన్నా కూడా వసూళ్ల విషయంలో తీవ్ర నిరాశ తప్పలేదు. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి స్టామినా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు రావడం లో పూర్తిగా విఫలం అయ్యింది. కేవలం సాయి పల్లవి మాత్రమే కాకుండా లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న నయనతార కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం లో సక్సెస్ కాలేక పోతుంది.
స్టార్ హీరోలు నటించిన సినిమా లు ప్లాప్ అయినా.. పర్వాలేదు అన్నట్లుగా ఉన్నా కూడా వసూళ్లు మినిమం ఉంటున్నాయి. కాని లేడీ స్టార్స్ గా పేర్లు ఉన్న హీరోయిన్స్ ప్రేక్షకులను థియేటర్ల వైపు అడుగులు వేయించడంలో ఏమాత్రం సక్సెస్ కాలేక పోతున్నారు. లేడీ సూపర్ స్టార్.. లేడీ పవర్ స్టార్ బిరుదులను నమ్ముకుని సినిమాలను తీసినా.. కొనుగోలు చేసిన వారికి చాలా సార్లు నిరాశ తప్పడం లేదు.
సాయి పల్లవికి ఇటీవల ఏ కార్యక్రమం వెళ్లినా కూడా విపరీతమైన ఫాలోయింగ్ కనిపించింది. సోషల్ మీడియాలో కూడా ఆమె ను ఆరాధించిన వారు ఎంతో మంది. వారంతా కూడా థియేటర్లకు వెళ్లారా అంటే లేదు అనే సమాధానం వస్తుంది. అదే ఆ స్థాయి లో ఒక హీరోను అభిమానిస్తే ఖచ్చితంగా సినిమా కు వెళ్తారు. కొద్ది మంది హీరోయిన్స్ నటించిన సినిమాలు ఒక మోస్తరు నుండి భారీ వసూళ్లు నమోదు చేస్తున్నాయి. కాని ఎక్కువ శాతం హీరోయిన్స్ పేరుకు మాత్రమే స్టార్స్.. వసూళ్లను రాబట్టడం లో జీరో లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.