Begin typing your search above and press return to search.
ఇందుమూలంగా మహేశ్ ఫ్యాన్స్ కి చెప్పేదేమిటంటే .. !
By: Tupaki Desk | 5 May 2022 3:30 PM GMTమహేశ్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా 'సర్కారువారి పాట' సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలవనున్నాయి. రామ్ - లక్ష్మణ్ ఈ ఫైట్స్ ను కంపోజ్ చేశారు. తాజా ఇంటర్వ్యూలో రామ్ - లక్ష్మణ్ మాట్లాడుతూ .. " మహేశ్ బాబుగారు తన పాత్రలో బాగా ఇన్వాల్వ్ అవుతారు. లోపల ఏదైతే ఫీలింగ్ ఉంటుందో దానిని ఫేస్ లోకి తీసుకురావడం మహేశ్ బాబు ప్రత్యేకత.
మేము కంపోజ్ చేసిన ఫైట్స్ చూసిన వెంటనే ఏది టీజర్లో వస్తుందో .. ఏది ట్రైలర్లో వచ్చేస్తుందో కూడా ఆయన చెప్పేవారు. ఇంతవరకూ టీజర్లో .. ట్రైలర్లో జనం చూసిన ఫైట్స్ శాంపిల్ మాత్రమే. అసలైన పండగ థియేటర్ కి వెళ్లిన తరువాత ఉంటుంది.
సాధారణంగా ఎప్పుడూ సరదాగా ఉండే మహేశ్ బాబు .. ఫైట్స్ చేసేటప్పుడు సెట్లో సీరియస్ గా ఉంటారని అంతా అనుకుంటారు. కానీ ఆయన ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు. ఒక సాంగ్ చేస్తున్నప్పుడు అక్కడున్న వారిని ఆయన ఎలా నవ్విస్తుంటారో .. ఫైట్స్ చేస్తున్నప్పుడు కూడా అంతే సరదాగా ఉంటారు.
యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు ఫేస్ లో ఎమోషన్ .. లోపల క్లారిటీ ఉండటం చాలా అవసరం. అలాంటి క్లారిటీ మహేశ్ లో కనిపిస్తుంది. సెట్లో ఆయన చాలా కూల్ గా .. ఓపెన్ గా ఉంటారు. ఒక పని మీద మనం 100 పెర్సెంట్ ఎఫర్ట్ పడితే ఆయన 1000 పెర్సెంట్ ఎఫర్ట్ పెడతారు. తాను చేస్తున్న పని పైనే పూర్తి దృష్టి పెడతారు.
తనకి నచ్చినవారితో ఆయన ఎక్కువ కాలం పనిచేస్తారు. అలాంటి మహేశ్ బాబుతో మేము చేస్తున్న నాలుగో సినిమా ఇది. ఆయన ఎక్కువగా ధ్యానం చేస్తుంటారు. దానికి సంబంధించిన విషయాలను కూడా మేము అడిగి తెలుసుకుంటూ ఉంటాము.
ఇక ఆయన వ్యాయామం కూడా రెగ్యులర్ గా చేస్తుంటారు. 'సరిలేరు నీ కెవ్వరు' సినిమా కోసం మేము కశ్మీర్ వెళ్లాము. సహజంగానే అక్కడ భయంకరమైన చలి ఉంది. ఆ చలిలో ఎట్లా పనిచేయాలా అని మేము అనుకుంటూ ఉంటే, ఆయన పొద్దున్నే లేచి వ్యాయామం చేసేవారు. షూటింగు నుంచి వచ్చిన తరువాత కూడా ఒక గంటపాటు వ్యాయామం చేసేవారు. ఆయన అంత అందంగా .. క్యూట్ గా కనిపించడానికి కారణం అదే. అందుకోసం ఆయన ఎంత శ్రమిస్తారో .. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మాకు అర్థమైంది. మహేశ్ ఫ్యాన్స్ ఆయనను ప్రేమించడమే కాదు .. ఆయన ఆరోగ్య సూత్రాలు కూడా ఫాలో కావాలి" అని చెప్పుకొచ్చారు.