Begin typing your search above and press return to search.

స‌మంత గులాబీ గుభాళింపు ఇకెంత దూరం?

By:  Tupaki Desk   |   3 May 2022 4:30 PM GMT
స‌మంత గులాబీ గుభాళింపు ఇకెంత దూరం?
X
ఫ్యాష‌న్ దివా సమంత ఉత్త‌మ‌మైన ఎంపిక‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆమె తన సార్టోరియల్ ఎంపికలను ఎలా పెంచుకోవాలో తెలిసిన న‌టి. అది అందమైన చీర అయినా లేదా ఆకర్షణీయమైన దుస్తులు ఏవైనా స‌రే ప‌ర్పెక్ట్ గా ఉండేలా చూసుకుంటుంది. డిజైన‌ర్ దుస్తుల్లో వివిధ భంగిమ‌ల్లో అంద‌మే అసూయ ప‌డేలా చేస్తుంది. తాజాగా గులాబీ రంగు దుస్తుల్లో ఊంఫ్ ఫ్యాక్టర్‌ను హైలైట్ చేస్తోంది. స‌మ్మ‌ర్ హీట్ కి త‌గ్గ చ‌క్క‌ని ఎంపిక‌తో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

ఏ పార్టీకైనా సిద్ధమవ్వాలంటే ఇలాంటి సింపుల్ డిజైన‌ర్ దుస్తులు ధ‌రిస్తే చాలు అనిపిస్తుంది. నటి గ్లామ్ అప్ విష‌యానికి వ‌స్తే మిడి ఫ్రిల్ పింక్ డ్రెస్‌లో హాట్‌నెస్ ని పెంచింది. ఈ దుస్తులు చాలా అంద‌మైన సీక్విన్స్‌లను కలిగి ఉన్న‌ నెక్‌లైన్ ని హైలైట్ చేస్తున్నాయి. నిగనిగలాడే పింక్ పౌట్.. బుగ్గ‌లు రెండు గులాబీ రంగుని పోల‌డం.. కనురెప్పలు పింక్ పిగ్మెంట్.. నిండైన‌ కనుబొమ్మలు అంద‌గా గీసిన ఐలైనర్‌తో అలంకరించబడి ఉన్నాయి.

ఈఫోటోలో అమ్మ‌డు ఎలాంటి యాక్సెసరీస్‌కు వెళ్ల‌లేదు. కేవ‌లం దుస్తులు మాత్ర‌మే ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంది. పార్టీ నైట్ నుండి డేట్ నైట్ వరకు ఇలాంటి వ‌స్ర్తాల‌కు తిరుగులేదు అనిపించింది.

సమంత పింక్ డ్రెస్ లో ఎంతో మ‌నోహ‌రంగా క‌నిపిస్తుంది. ఈ దుస్తుల్ని ప్రీతం జుకాల్కర్ స్టైల్ చేసారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. స‌మంత అభిమానులు హాట్ కామెంట్లు షురూ చేసారు.

ఇక స‌మంత న‌టిస్తోన్న 'య‌శోద' సినిమా విష‌యానికి వ‌స్తే ఇదొక సస్పెన్స్ థ్రిల్ల‌ర్ స్టోరీ. హ‌రి శంక‌ర్-హ‌రీష్ అనే ఇద్ద‌రు ద‌ర్శ‌కులు తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు..త‌మిళ్ భాష‌ల్లో రూపొందుతున్న చిత్ర‌మిది. ఉన్ని ముకుంద‌న్.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

అలాగే స‌మంత న‌టిస్తోన్న మ‌రో లేడీ ఓరియేంటెడ్ చిత్రం 'శాకుంతలం'. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అలాగే బాలీవుడ్ లో వ‌రుణ్ ధావ‌న్ తో ఓ సినిమా చేస్తుంది.