Begin typing your search above and press return to search.
అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు: తమన్నా
By: Tupaki Desk | 1 May 2022 2:30 AM GMTఅందం పెట్టుకున్న పేరే తమన్నా అన్నట్టుగా ఉంటుంది తమన్నా గ్లామర్. తెల్ల మందారాలైనా .. ఎర్ర గులాబీలైనా ఆమెను చూసి చిన్నబుచ్చుకోవలసిందే. అప్సరసలు అసూయపడాల్సిందే .. అవమానాలు పొందాల్సిందే. ఆ గ్లామర్ తో అవకాశాలు పట్టేసినప్పటికీ, ఆ తరువాత అభినయాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్లింది. అందమైన అభినయానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. చాలామంది కథానాయికలు ఒక భాషలో సినిమాలు చేస్తూ మరో భాష సినిమాలను పక్కన పెడుతుంటారు. అలా చేయకుండా ఇటు దక్షిణాదిన .. అటు ఉత్తరాదిన తన కెరియర్ ను చక్కబెడుతూ వచ్చిన తెలివి తేటలు తమన్నా సొంతం.
దాదాపు తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన ఆడిపాడేసిన ఈ బ్యూటీ, నాయిక ప్రధానమైన పాత్రలను చేయడంలోనూ తనని తాను నిరూపించుకుంటోంది. ప్రతి ఏడాది కొత్త కథానాయికలు చాలామందినే వస్తున్నప్పటికీ, ఆ పోటీని ఎదుర్కుంటూ ముందుకు వెళుతోంది.
ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఎఫ్ 3' సిద్ధమవు తోంది. 'భోళా శంకర్' సినిమాలో చిరంజీవి సరసన సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె అనేక విషయాలను ప్రస్తావించింది.
"నేను ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే ఇంతకాలమైపోయిందా? అనిపిస్తోంది. చూస్తుండగానే సీనియారిటీ పెరిగిపోయింది. సీనియారిటీ అనేది ఒక బాద్యత వంటిది. కెరియర్ కొత్తలో ఎలాంటి పాత్రలను ఎంచుకున్నా ఎవరూ పట్టించుకోరు. కానీ ఇప్పుడు ఎంచుకునే పాత్రల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. "ఏంటి .. తమన్నా ఇలాంటి పాత్ర చేసింది?" అని అందరితో అనిపించుకోకూడదు. అందువల్లనే పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాను. నేను చేసే పాత్రల వలన నా స్థాయి పడిపోకుండా చూసుకుంటున్నాను.
నా కెరియర్ మొదలై ఇన్నేళ్లయినా .. ఇంతవరకూ నేను చేయాలనుకున్న చాలా పాత్రలను చేయనేలేదు. అలాంటి పాత్రలు చేసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. నన్ను నేను పూర్తి స్థాయిలో ఆవిష్కరించే సమయం కోసం ఎదురు చూస్తున్నాను.
నేను కలలు కనే పాత్ర నాకు దొరికినా ఆ తరువాత అంతకంటే అద్భుతమైన పాత్రను చేయాలనే కోరిక నాలో కలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్థానానికి చేరుకున్నాను గనుక, దానిని కాపాడుకోవడమే నా ముందున్న పని " అంటూ చెప్పుకొచ్చింది.