Begin typing your search above and press return to search.
ఆ విషయంలో బన్నీ తగ్గేదేలే..!
By: Tupaki Desk | 3 May 2022 5:30 PM GMTటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' 'పుష్ప: ది రైజ్' వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ముఖ్యంగా 'పుష్ప' సినిమాతో బన్నీ నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నారు. పుష్పరాజ్ పాత్రలో అగ్ర హీరో అభినయానికి అందరూ ఫిదా అయ్యారు.
ఈ నేపథ్యంలోనే నార్త్ సర్క్యూట్స్ లో 'పుష్ప' పార్ట్-1 సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్ అందుకుని సంచనలం సృష్టించింది. దీంతో ఇప్పుడు రెండో భాగం 'పుష్ప: ది రూల్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన క్రేజ్ తో అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్ రెట్టింపు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవి శంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. బన్నీ మేనమామలకు చెందిన ముత్యంశెట్టి మీడియా మూవీ నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ దాదాపు 35 కోట్ల పారితోషికం అందుకున్నట్లు టాక్ ఉంది.
అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం 'పుష్ప' పార్ట్-2 కోసం బన్నీ రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మొదటి భాగం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై దాదాపు 350 కోట్ల గ్రాస్ వసూలు చేసిన నేపథ్యంలో.. హీరో అల్లు అర్జున్ డిమాండ్ చేసినంత ఇవ్వడానికి మేకర్స్ అంగీకరించారట.
టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా ఉన్నారు. డార్లింగ్ ఒక్కో సినిమాకు 100 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తున్నారని ప్రచారంలో ఉంది. 50 కోట్ల వరకూ పారితోషకం పుచ్చుకునే మహేష్ బాబు.. సినిమా లాభల్లోనూ వాటా తీసుకుంటారని టాక్.
పవన్ కళ్యాణ్ కాల్షీట్స్ తో సంబంధం లేకుండా ఒక్కో మూవీకి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. RRR సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయిన ఎన్టీఆర్ - రామ్ చరణ్ కూడా తమ పారితోషికాలు రెట్టింపు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా రేటు పెంచేశారని అంటున్నారు.
'పుష్ప 2' సినిమా భారీ విజయాన్ని అందుకుంటే పాన్ ఇండియా స్టార్స్ లో బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్లే అవకాశం ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ పప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ సక్సెస్ ని దృష్టిలో పెట్టుకొని సుక్కూ అండ్ టీమ్ స్ర్కిప్ట్ లో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్. జూలై లో 'పుష్ప: ది రూల్' సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.