Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ కొత్త షెహ‌జాదానా..ఎవ‌రా డార్లింగ్‌?

By:  Tupaki Desk   |   26 Nov 2022 3:30 AM GMT
ప్ర‌భాస్ కొత్త షెహ‌జాదానా..ఎవ‌రా డార్లింగ్‌?
X
టాలీవుడ్ లో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లు చాలా మందే వున్నా అందులో ముందు వ‌రుస‌లో నిలుస్తున్న హీరో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌. ఇండ‌స్ట్రీలో ఎంత మంది పెళ్లికి రెడీగా వున్నా కానీ ప్ర‌భాస్ పై వ‌చ్చిన‌న్ని పెళ్లి వార్త‌లు మ‌రో హీరో మీద రాలేద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. ఇప్ప‌టికీ ప్ర‌భాస్ పై పెళ్లి వార్త‌లు ఆగ‌డం లేదు. గ‌త కొంత కాలంగా ప్ర‌భాస్ ప‌లానా యువ‌తిని పెళ్లాడ‌బోతున్నాడ‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి వార్త చెప్ప‌బోతున్నారంటూ వార్త‌లు షికారు చేశాయి.

ఇప్ప‌టికీ షికారు చేస్తూనే వున్నాయి. తాజాగా కృతిస‌న‌న్ తో ప్రేమ‌లో వున్నాడంటూ బాలీవుడ్ లో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. రీసెంట్ గా అయోధ్య‌లో జ‌రిగిన `ఆదిపురుష్‌` ఫ‌స్ట్ లుక్ లాంచ్ లో వీరిద్ద‌రిని చూసిన వారంతా ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ ఏదో జ‌ర‌గుతోంద‌ని, ఆ కార‌ణంగానే ఇద్ద‌రు ఇలా క్లోజ్ గా వుంటున్నారంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కృతితో క‌లిసి వున్న ప్ర‌భాస్ ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

ప్ర‌భాస్ తో క‌లిసి కృతి స‌న‌న్ `ఆదిపురుష్`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఓం రౌత్ రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ద‌శ నుంచి ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ మ‌ధ్య ఏదో జ‌రుగుతోందంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి.

అయితే ఈ వార్త‌ల‌పై ఇండైరెక్ట్ గా బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ హింట్ ఇచ్చాడు. వ‌రుణ్ ధావ‌న్‌, కృతిసన‌న్ క‌లిసి న‌టించిన మూవీ `భేడియా`. హార‌ర్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీని ఈ శుక్ర‌వారం హిందీ, తెలుగు భాష‌ల్లో రిలీజ్ చేశారు.

ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన వ‌రుణ్ ధావ‌న్ మాట్లాడుతూ ప్ర‌భాస్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించాడు. ప్ర‌భాస్ ల‌వ్ లైఫ్ గురించి కీల‌క అప్ డేట్ ఇచ్చాడు. ప్ర‌భాస్ జీవితంలో కొత్త షెహ‌జాదా వుంద‌ని, అయితే ఆమె సంతోషంగా వుండేది కాద‌ని చెప్పాడు. అంతే కాకుండా కృతి, ప్ర‌భాస్ మంచి జోడీ అంటూ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. వ‌రుణ్ ధావ‌న్ ఇలా చెప్పి చెప్ప‌న‌ట్టు చెప్పి క‌న్ఫ్యూజ్ చేయ‌డంతో మ‌ళ్లీ అంద‌రిలో ప్ర‌భాస్ ల‌వ్ లైఫ్ పై ఆలోచ‌న మొద‌లైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.