Begin typing your search above and press return to search.

ప్రోమో: రొమాన్స్ కొత్తగా లేదంటున్న మెగా మేనల్లుడు..!

By:  Tupaki Desk   |   4 May 2022 11:30 AM GMT
ప్రోమో: రొమాన్స్ కొత్తగా లేదంటున్న మెగా మేనల్లుడు..!
X
'ఉప్పెన' సినిమాతో హీరోగా సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ .. ఇప్పుడు ''రంగ రంగ వైభవంగా'' అనే చిత్రంతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. తమిళ 'అర్జున్ రెడ్డి' రీమేక్ ఫేమ్ గిరీశాయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

న్యూ ఏజ్ యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న 'రంగ రంగ వైభవంగా' సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ మరియు 'తెలుసా తెలుసా' ఫస్ట్ సింగిల్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఈ క్రమంలో 'కొత్తగా లేదేంటి' అనే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సాంగ్ ప్రోమోని వదిలారు. 'కొత్తగా లేదేంటి.. కొత్తగా లేదేంటి.. ఇంత దగ్గరున్నా నువ్వు నేనూ కొత్తగా లేదేంటి..' అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది.

ఇది వైష్ణవ్ తేజ్ మరియు కేతికా శర్మ లపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు తెలుస్తోంది. విజువల్ గా కూడా ఈ మెలోడీ సాంగ్ బ్యూటీఫుల్ గా ఉంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ అందమైన ప్రేమ గీతాన్ని స్వరపరిచారు.

గీత రచయిత శ్రీమణి సాహిత్యం అందించగా.. యువ సింగర్స్ అర్మాన్ మాలిక్ మరియు హరి ప్రియ కలిసి ఆలపించారు. 'కొత్తగా లేదేంటి' ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను మే 6వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

'రంగరంగ వైభవంగా' చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.