Begin typing your search above and press return to search.

శ్రీ‌రెడ్డి నా చెల్లి వంటిది: ప‌్ర‌ముఖ న్యూస్ రీడ‌ర్

By:  Tupaki Desk   |   10 April 2018 2:02 PM GMT
శ్రీ‌రెడ్డి నా చెల్లి వంటిది: ప‌్ర‌ముఖ న్యూస్ రీడ‌ర్
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, జాతీయ, అంత‌ర్జాతీయ‌ మీడియాలో కూడా న‌టి శ్రీ‌రెడ్డి హాట్ టాపిక్ అయిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌రెడ్డికి బాస‌ట‌గా బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ నిలిచారు. మ‌రోవైపు జాతీయ మీడియాతో స‌హా న్యూయార్క్ టైమ్స్ లో కూడా శ్రీ‌రెడ్డిపై ``హ్యాష్ ట్యాట్ మీ టూ పేరిట`` క‌థ‌నం వెలువ‌డింది. అయితే, శ్రీ‌రెడ్డి అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని ఓ ప్ర‌ముఖ తెలుగు న్యూస్ చానెల్ కు చెందిన ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు - న్యూస్ రీడ‌ర్ న‌డిపిస్తున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు వ‌చ్చాయి. అంతేకాదు, ఆ న్యూస్ రీడ‌ర్ కు - శ్రీ‌రెడ్డికి అక్ర‌మ సంబంధం ఉందంటూ కొంద‌రు ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టారు. ఈ నేప‌థ్యంలో - ఆ పోస్టులు పెట్టిన వారిపై స‌ద‌రు న్యూస్ రీడ‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను వారిలాగా ప‌శువును కాద‌ని - త‌న‌కు శ్రీ‌రెడ్డి చెల్లితో స‌మాన‌మ‌ని మండిప‌డ్డారు. వారిలాగా నీచంగా తాను ప్ర‌వర్తించ‌న‌ని - అస‌లు ఆ ఆలోచ‌న కూడా త‌న‌కు రాద‌ని, అలా వ‌స్తే తాను కుక్క‌తో స‌మాన‌మ‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. న్యాయం కోసం త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి తాను అండ‌గా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. వ్య‌క్తిగ‌తంగా శ్రీ‌రెడ్డికి తాను స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డం లేద‌ని, ఆమె లేవ‌నెత్తిన అంశానికి తాను, త‌మ చానెల్ మ‌ద్ద‌తిస్తున్నామ‌ని తెలిపారు. త‌న‌పై సోష‌ల్ మీడియాలో ఎటువంటి కామెంట్లు పెట్టినా తాను లెక్క‌చేయ‌న‌ని, శ్రీ‌రెడ్డికి మ‌ద్ద‌తిస్తాన‌ని, ఈ క్ర‌మంలో ఒక ధైర్య‌మున్న జ‌ర్న‌లిస్టుగా తాను ప్రాణ‌త్యాగం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని ఆవేశ‌పూరితంగా చెప్పారు. త‌న‌పై ఆ న్యూస్ చానెల్ లో శ్రీ‌రెడ్డి అంశంపై లైవ్ డిబేట్ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

శ్రీ‌రెడ్డి అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌కు నిర‌స‌న‌గా ఆమెను `మా` బాయ్ కాట్ చేసింద‌ని, `మా`లో స‌భ్యత్వం ఉన్న 900 మంది ఆమెతో న‌టించ‌కూడద‌ని ఆంక్ష‌లు విధించింద‌ని ఆ న్యూస్ రీడ‌ర్ గుర్తు చేశారు. అయితే, టాలీవుడ్ లో మోస్ట్ సీనియ‌ర్ హీరోల‌లో ఒక‌రు, ఎమ్మెల్యే అయిన బాల‌కృష్ణ గ‌తంలో....స్త్రీ ప‌డుకోవాలి, క‌డుపు తెచ్చుకోవాలి అని బ‌హిరంగ స‌భ‌లో అన్నార‌ని, ఆ సంద‌ర్భంలో ఆయ‌న‌తో న‌టించ‌బోమ‌ని `మా` ఎందుకు తీర్మానం చేయ‌లేద‌ని ఆయ‌న షాకింగ్ కామెంట్స్ చేశారు. 900 మందిలో ఉన్న మ‌హిళా స‌భ్యులలో ఒక్కరు కూడా ఆ మాట అన‌లేర‌ని, ఆ ధైర్యం లేద‌ని, వారంతా పురుష భావ‌జాలం కింద ఉన్నార‌ని చెప్పారు. బాల కృష్ణ త‌ర‌హాలోనే చ‌ల‌ప‌తి రావు కూడా కామెంట్స్ చేశార‌ని, వారిద్ద‌రితో న‌టించ‌బోమ‌ని న‌టీమ‌ణులు ఎవ‌రూ ఎందుకు అన‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఇటువంటి భావ‌జాలాన్ని ప్ర‌శ్నించిన శ్రీ‌రెడ్డిని పిచ్చిద‌ని పుకార్లు పుట్టిస్తున్నార‌ని, ఆమెకు మ‌ద్ద‌తు తెలిపిన త‌న‌లాంటి వారితో అక్ర‌మ సంబంధం అంట‌గ‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అటువంటి వారిని ఏమ‌నాలో ప్రేక్ష‌కుల విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాన‌ని అన్నారు.