Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'నెక్స్ట్ ఏంటి'
By: Tupaki Desk | 7 Dec 2018 10:05 AM GMTచిత్రం : 'నెక్స్ట్ ఏంటి'
నటీనటులు: తమన్నా - సందీప్ కిషన్ - నవదీప్ - లారిసా -శరత్ కుమార్ - పూనమ్ కౌర్ తదితరులు
సంగీతం: లియోన్ జేమ్స్
ఛాయాగ్రహణం: మహేష్ చంద్ర భట్
నిర్మాతలు: రైనా జోషి - అక్షయ్ పూరి
రచన - దర్శకత్వం: కునాల్ కోహ్లి
బాలీవుడ్లో ‘హమ్ తుమ్’.. ‘ఫనా’ లాంటి సినిమాలు తీసిన కునాల్ కోహ్లి.. తెలుగులో తమన్నా-సందీప్ కిషన్ కాంబినేషన్లో ఓ ప్రేమకథ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ చిత్రమైన కాంబినేషన్లో తెరకెక్కిన ‘నెక్స్ట్ నువ్వే’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని ముచ్చట్లేంటో చూద్దాం పదండి.
కథ:
టామీ (తమన్నా) తండ్రి పెంపకంలో స్వేచ్ఛగా పెరిగిన అమ్మాయి. టీనేజీలోనే ఆమె సంజు (సందీప్ కిషన్) ప్రేమలో పడుతుంది. ఐతే అమ్మాయిల నుంచి ప్రధానంగా శారీరక సుఖం ఆశించే సంజు అంటే పడక అతడి నుంచి విడిపోతుంది. ఆ తర్వాత ఆమె కొన్నేళ్లకు క్రిష్ (నవదీప్) అనే పెద్ద వయస్కుడిని ఇష్టపడుతుంది. కానీ అప్పటికే పెళ్లయి డైవర్స్ తీసుకున్న అతడితో జీవితం పంచుకోలేక దూరమవుతుంది. మరోవైపు సంజు ఇంకో అమ్మాయితో పెళ్లిదాకా వెళ్లి వెనక్కి తగ్గుతాడు. ఈ ప్రయాణంలో ఇటు టామీకి.. అటు సంజుకు నిజమైన ప్రేమ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఆ మెచ్యూరిటీ వచ్చాక మళ్లీ ఇద్దరూ కలిసి ప్రయాణం మొదలుపెడతారు. ఈ ప్రయాణం ఎక్కడిదాకా వెళ్లింది.. తిరిగి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘నెక్స్ట్ ఏంటి’ సినిమాలో ముందుగా ఒక అమ్మాయి-అబ్బాయి కలుస్తారు.. అమ్మాయిలు-అబ్బాయిలు.. వాళ్ల మనస్తత్వాలు.. ప్రేమ.. పెళ్లి.. సెక్స్.. ఇత్యాది అంశాల గురించి మాట్లాడుకుంటారు. తర్వాత ఆ అమ్మాయి-ఆమె తండ్రి కలుస్తారు. వాళ్లు కూడా అమ్మాయిలు-అబ్బాయిలు.. వాళ్ల మనస్తత్వాలు.. ప్రేమ.. పెళ్లి.. సెక్స్.. ఇత్యాది అంశాల గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఆ అమ్మాయి మరో అబ్బాయిని కలుస్తుంది. వాళ్లిద్దరూ కలిసి అమ్మాయిలు-అబ్బాయిలు.. వాళ్ల మనస్తత్వాలు.. ప్రేమ.. పెళ్లి.. సెక్స్.. ఇత్యాది అంశాల గురించి మాట్లాడుకుంటారు. ఆపై ఈ అమ్మాయి నుంచి విడిపోయిన అబ్బాయి ఇంకో అమ్మాయిని కలుస్తారు. వాళ్లిద్దరూ కూడా అమ్మాయిలు-అబ్బాయిలు.. వాళ్ల మనస్తత్వాలు.. ప్రేమ.. పెళ్లి.. సెక్స్.. ఇత్యాది అంశాల గురించి మాట్లాడుకుంటారు. చివరికి ముందుగా విడిపోయిన అమ్మాయి-అబ్బాయి తిరిగి కలుస్తారు. వాళ్లు కూడా అమ్మాయిలు-అబ్బాయిలు.. వాళ్ల మనస్తత్వాలు.. ప్రేమ.. పెళ్లి.. సెక్స్.. ఇత్యాది అంశాల గురించి మాట్లాడుకుంటారు. ఏమిటి చెప్పిందే చెప్పి.. విసిగిస్తున్నారని అసహనం కలుగుతోందా? మరి రెండు గంటల పాటు ‘నెక్స్ట్ నువ్వే’లో ఇదే తంతును తిప్పి తిప్పి తెరమీద చూసిన వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.
బాలీవుడ్లో ‘హమ్ తుమ్’.. ‘ఫనా’ లాంటి మంచి సినిమాలు తీసిన దర్శకుడు కునాల్ కోహ్లి. ప్రేమకథల్ని బాగా డీల్ చేస్తాడని అతడి పేరుంది. మధ్యలో కొన్నేళ్ల పాటు కనిపించకుండా పోయిన కునాల్ ఆశ్చర్యకరంగా తెలుగులో సినిమా తీశాడు. మరి మధ్యలో అతనేమైనా అమ్మాయిలు-అబ్బాయిలు-ప్రేమ-పెళ్లి-సెక్స్.. ఈ అంశాల మీద పీహెచ్డీ మొదలుపెట్టి థీసిస్ సమర్పించాల్సిన అవసరం ఏమైనా పడిందో ఏమో తెలియదు.. ఒక మానసిక నిపుణుడి స్థాయిలో పెద్ద పుస్తకమే రాసి.. దాన్ని దృశ్యరూపంలో చూసుకుందామని సరదాగా ‘నెక్స్ట్ ఏంటి’ సినిమా తీసేసినట్లున్నాడు. సినిమాలో ఒకచోట నవదీప్ తమన్నాతో అంటాడు.. ‘‘మనం నాన్ స్టాప్ గా 6 గంటల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం తెలుసా.. కానీ బోరే కొట్టలేదు అని’’. సినిమా చూసే ప్రేక్షకుల ఫీలింగ్ ఎలా ఉంటుందో గెస్ చేసి ఈ డైలాగ్ పెట్టారేమో తెలియదు కానీ.. రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా సాగే ఈ కాన్వర్జేషన్లు బోర్ కొట్టించడం కాదు.. విపరీతమైన నస పెడతాయి.
తమన్నా లాంటి అందమైన హీరోయిన్.. సందీప్ కిషన్.. నవదీప్ లాంటి మంచి పెర్ఫామర్లు.. కావాల్సినంత ఖర్చు పెట్టే సచిన్ జోషి లాంటి నిర్మాత.. రిచ్ ఫారిన్ లొకేషన్లు.. మంచి కెమెరామన్.. అభిరుచి ఉన్న సంగీత దర్శకుడు.. దర్శకుడు కునాల్ కోహ్లికి ఈ రకంగా మంచి వనరులే సమకూరాయి. వీరిలో ప్రతి ఒక్కరూ తమ వైపు నుంచి మంచి ఔట్ పుట్ ఇచ్చారు. కానీ సినిమా అనేది దృశ్య ప్రధానమైంది అని మరిచిపోయి.. రెండు గంటల పాటు ఆపకుండా కాన్వర్జేషన్ల మీద కాన్వర్జేషన్లు పెట్టి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు కునాల్. ఒక దశ దాటాక మనం సినిమాకు వచ్చామా.. లేదంటే ఏదైనా ఫిలాసఫీ కోర్సు సెమినార్ క్లాసులో కూర్చున్నామా అన్న సందేహం కలుగుతుంది. లవ్ స్టోరీలో ఉండాల్సిన ఫీల్ లేదు. పాత్రలతో ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. లొకేషన్లు.. నటీనటుల హావభావాలు.. నేపథ్య సంగీతం.. కెమెరా పనితనం.. ఇవన్నీ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ చూస్తున్న భావన కలిగించే ప్రయత్నం చేస్తాయి కానీ.. కథాకథనాల్లో.. పాత్రల్లో.. సన్నివేశాల్లో.. డైలాగుల్లో ఫీల్ అన్నదే లేకపోవడంతో అంతా వృథా అయిపోయింది.
చివర్లో హీరో అటు తిరిగి నిలబడి ఉంటే.. హీరోయిన్ సమీపంలో వచ్చి నిలబడుతుంది. వెంటనే హీరో.. ‘నా సిక్స్త్ సెన్స్ చూశావా.. నిన్ను చూడకుండానే నువ్వొచ్చేశావని గుర్తు పట్టేసింది’’ అంటాడు. దానికి హీరోయిన్.. ‘‘పని చేసింది నీ సిక్స్త్ సెన్స్ కాదు.. నా పెర్ఫ్యూమ్’’ అంటూ జోక్ పేలుస్తుంది. అప్పటిదాకా క్లాసుల మీద క్లాసులు పీకి.. కాన్వర్జేషన్లతో పిచ్చెక్కించి చివరగా ఇలాంటి జోక్ పేలిస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. అసలు ఈ సినిమాకు టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరన్నది అర్థం కాదు. మాస్ ప్రేక్షకులకు అర్థం కాదేమో.. క్లాస్ జనాలు.. ఇంటిలిజెంట్ ఆడియన్స్ కోసం తీశారని అనుకోవడానికి కూడా లేదు. ఎలాంటి వాళ్లకైనా సరే.. మొదలైన అరగంటకే విసుగు తెప్పించి నిద్రలోకి జారుకునేలా చేయగల సత్తా ఉన్న సినిమా ఇదనడంలో సందేహమే లేదు.
నటీనటులు:
కునాల్ బాలీవుడ్లో మంచి సినిమాలు తీసిన దర్శకుడు కాబట్టి తమకెలాంటి ఫీలింగ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు నచ్చే సినిమానే తీస్తున్నాడని నమ్మారో ఏమో తెలియదు కానీ.. లీడ్ యాక్టర్లు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. తమన్నా సినిమాకు పెద్ద ఆకర్షణ. అందం.. అభినయం రెంటితోనూ ఆమె ఆకట్టుకుంది. 30 ఏళ్ల వయసులో ఆమె ఇంత రిఫ్రెషింగ్ గా కనిపించడం ఆశ్చర్యమే. సందీప్ కిషన్ ఆమె పక్కన అంతగా సెట్టవ్వకపోయినా.. పెర్ఫామెన్స్ బాగుంది. నవదీప్ మరోసారి పరిణతితో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. లారిసాకు పెద్దగా స్కోప్ లేకపోయింది. శరత్ కుమార్ ఉన్న కాసేపు తన అనుభవాన్ని చూపించారు. పూనమ్ కౌర్ చాలా పేలవంగా కనిపించింది. పూర్తిగా ఆకర్షణ కోల్పోయిన పూనమ్ ను చూడబుద్ధేయదు. ఆమె నటన గురించి కూడా చెప్పడానికేమీ లేదు.
సాంకేతికవర్గం: ‘నెక్స్ట్ నువ్వే’ సాంకేతికంగా మాత్రం ఉన్నంతగా కనిపిస్తుంది. లియోన్ జేమ్స్ పాటలు.. నేపథ్య సంగీతం రెండూ బావున్నాయి. మహేష్ చంద్ర భట్ కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. విదేశాల్లోని అందమైన లొకేషన్లను చక్కగా ఉపయోగించుకున్నారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఏం చూసి ఖర్చు పెట్టేశారో కానీ.. సినిమా అంతా కూడా రిచ్ గా కనిపిస్తుంది. ఐతే ఇటు నటీనటులు.. అటు సాంకేతిక నిపుణులు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినా.. దర్శకుడు కునాల్ కోహ్లీనే పేలవమైన పనితనం చూపించాడు. తెలుగులోనే కాదు.. హిందీలో అయినా ఇలాంటి సినిమాల్ని భరించడం కష్టం. కునాల్ ఏ రకంగానూ మెప్పించలేకపోయాడు.
చివరగా: నెక్స్ట్ ఏంటి.. నాన్ స్టాప్ సుత్తి
రేటింగ్-1/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre