Begin typing your search above and press return to search.
ఏముంది ఈ ట్రైలర్లో..?
By: Tupaki Desk | 19 Sep 2017 10:13 AM GMTఅల్లు అరవింద్.. యువి క్రియేషన్స్ వంశీ-ప్రమోద్.. బన్నీ వాసు.. జ్నానవేల్ రాజా.. ఇంతమంది ప్రముఖ నిర్మాతలు కలిసి పెట్టిన బేనర్ ‘వి-4’ క్రియేషన్స్. తక్కువ బడ్జెట్లో వైవిధ్యమైన సినిమాలు తీయాలన్న లక్ష్యంతో పెట్టిన ఈ బేనర్ నుంచి ముందుగా వస్తున్నా సినిమా ‘నెక్స్ట్ నువ్వే’. ఐతే కొత్తదనాన్ని ప్రోత్సహించడానికి పెట్టిన బేనర్లో తొలిసారి తీసింది ఒక రీమేక్ సినిమా కావడం గమనార్హం. తమిళంలో మూడేళ్ల కిందట విజయవంతమైన ‘యామిరిక్కు భయమే’కు ఇది రీమేక్. టీవీ సీరియళ్లు, ప్రోగ్రాములతో పాపులరైన ప్రభాకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. సాయికుమార్ తనయుడు ఆది కథానాయకుడిగా నటించిన ‘నెక్స్ట్ నువ్వే’ ట్రైలర్ లాంచ్ అయింది.
కొన్నేళ్ల కిందటే ఔట్ డేట్ అయిపోయిందనుకున్న రొటీన్ హార్రర్ కామెడీ సినిమాలాగే అనిపిస్తోంది ‘నెక్స్ట్ నువ్వే’. అప్పుల్లో కూరుకుపోయిన హీరో.. సినిమా హీరోయిన్ కావాలనుకుని టీవీ హీరోయిన్ కు పరిమితం అయిపోయానన్న ఫ్రస్టేషన్లో ఉన్న అతడి గర్ల్ ఫ్రెండ్.. ఒక శృంగారభరిత చిత్రం తీసి దెబ్బ తిన్న మరో వ్యక్తి.. హీరోను వలలో వేసుకోవాలనుకునే మరో అమ్మాయి.. వీళ్లందరూ కలిసి ఓ పాత బంగ్లాలోకి వచ్చి అక్కడ హోటల్ పెడతారు. అందులోకి వచ్చే గెస్టులందరూ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. దాని వెనుక మర్మమేంటో హీరో ఎలా బయటపెట్టాడన్నదే ఈ కథ. ట్రైలర్లోనే ఈ కథంతా విప్పేశారు. వేరే సర్ప్రైజులేమీ ఉన్నట్లుగా లేవు. సగటు హార్రర్ సినిమాలోని అంశాలే ఇందులోనూ కనిపిస్తున్నాయి. తమిళ వెర్షన్ ను యాజిటీజ్ గా దించేసినట్లున్నారు తప్ప.. కొత్తదనం ఏమీ కనిపించట్లేదు. ట్రైలర్లో కొత్తదనం ఏమైనా ఉందంటే.. అది సెటైరికల్‌గా సాగే వెన్నెల కిషోర్ నరేషన్ మాత్రమే. ట్రైలర్లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. నవంబరు 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందట.