Begin typing your search above and press return to search.
భారమంతా 31 మీదే
By: Tupaki Desk | 27 May 2019 6:52 AM GMTగత నెలలో వరస సినిమాల హడావిడి తర్వాత ఎన్నికల కోలాహలం మొదలై టికెట్ కౌంటర్ల దగ్గర కొంత స్తబ్దత నెలకొంది. మే 9న వచ్చిన మహర్షితో మళ్ళీ ఊపందుకుంది. కనీసం మూడు నాలుగు వారాలు మహేష్ రచ్చ చేస్తాడనుకుంటే నెలకే ఫైనల్ రన్ తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. ఇక ఏదో డిఫరెంట్ అటెంప్ట్ గా కనిపించిన సీత మొన్న రిలీజై నిరాశ పరచడంతో ఈ రోజు నుంచి డ్రాప్ విపరీతంగా ఉంటుందని ట్రేడ్ ముందే ప్రిపేర్ అయ్యుంది.
దీంతో పాటే వచ్చిన అంజలి లీసా మల్టీ హీరోయిన్స్ నాగకన్య కన్నడ డబ్బింగ్ ఎవడు తక్కువ కాదు హాలీవుడ్ మూవీ అల్లాదీన్ ఏవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇందులో మొదటి మూడు కనీసం విడుదలైన విషయం కూడా సగటు ప్రేక్షకులకు తెలియదంటే ఆశ్చర్యం లేదేమో. అందుకే నెంబర్ ఘనంగా ఉన్నా ఫలితం శూన్యం అన్నట్టుగా ఉంది బాక్స్ ఆఫీస్
ఇప్పుడు శుక్రవారం రాబోయే సూర్య ఎన్జికె విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్ లు ఈ లోటుని పూడ్చాల్సి ఉంది. వీటి మీదా భీభత్సమైన హైప్ ఏమి లేదు. టాక్ తోనే జనాన్ని రాబట్టాలి. పబ్లిసిటీ విషయంలో ఎంతో కొంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి సగటు పబ్లిక్ కి రీచ్ కావడం లేదన్నది నిజం. ఇప్పుడు నెలకొన్న డల్ నెస్ ని పోగొట్టేలా మినిమమ్ కంటెంట్ ఉన్నా చాలు మంచి రన్ ని రాబట్టుకోవచ్చు.
సమ్మర్ లో ఎక్కువ ఆప్షన్స్ లేక మూవీ లవర్స్ నీరసించిపోతున్నారు. థియేటర్ కూర్చును ఎంజాయ్ చేద్దాం అంటే సరైన సినిమా లేక ఇబ్బంది పడుతున్నారు. దానికి ఈ ఫ్రైడే నుంచి అయినా చెక్ పడుతుందేమో చూడాలి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని వాడుకుంటే కనక వసూళ్లు రాబట్టుకోవచ్చు. అందుకే టికెట్ కౌంటర్ల దగ్గర వేగాన్ని పెంచే భారం ఈ శుక్రవారం మీదే పడింది.