Begin typing your search above and press return to search.

నిండా ముంచిన స్టార్ డిజాస్టర్

By:  Tupaki Desk   |   21 Jun 2019 8:27 AM GMT
నిండా ముంచిన స్టార్ డిజాస్టర్
X
గజినీ లాంటి ఒక్క సినిమాతో టాలీవుడ్ లోనూ స్టార్ హీరోల స్థాయిలో మార్కెట్ తెచ్చుకున్న సూర్యకు ఆ ఆనందం ఎంతోకాలం నిలవకుండానే క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. మధ్యలో సింగం లాంటివి కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినా అతని స్థాయి హిట్ దక్కి చాలా కాలమే అయ్యింది. కనీసం మొదటి రోజు ఫస్ట్ షోని ఫుల్ చేయించలేని స్టేజికి రావడం నిజంగా బాధాకరం. ఇప్పుడు ఎన్జికె రిజల్ట్ తో అది పీక్స్ కు వెళ్లిపోయింది.

శ్రీరాఘవ మేధావితనం మొత్తం పొలిటికల్ థ్రిల్లర్ లో జొప్పించడంతో దారుణమైన ఫలితాన్ని అందుకుంది. సూర్య దీని నిర్మాణ భాగస్వాముల్లో ఒకడు. పారితోషికం కూడా లాభాల నుంచే తీసుకోవాలనే నిబంధన మీద రిస్క్ చేసి మరీ ఒప్పుకున్నాడు. దర్శకుడి మీద నమ్మకం అలాంటిది. కట్ చేస్తే ఫైనల్ రన్ పూర్తయ్యాక అన్ని బాషలలో కలిపి ఎన్జికె కేవలం 26 కోట్లు మాత్రమే తీసుకొచ్చింది. తెలుగు వెర్షన్ ని 9 కోట్లకు రాధామోహన్ కొంటె అందులో సగం వెనక్కు తేవడానికే ముచ్చెమటలు పట్టింది. దీంతో ప్రతి చోటా సగం పెట్టుబడి గోవిందా కొట్టేసింది.

సూర్య రెమ్యునరేషనే పాతిక కోట్ల దాకా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అంత మొత్తం కలెక్షన్లు కూడా రావడం లేదంటే ఇక బయ్యర్లు వచ్చే సినిమా మీద నమ్మకం ఎలా పెట్టుకుంటారు. ఇప్పుడు దీని ఎఫెక్ట్ నేరుగా ఆగస్ట్ లో రిలీజ్ కానున్న కాప్పన్ మీద పడుతోంది. తమిళ్ వరకు ఓకే కాని మిగిలిన బాషలలో మాత్రం సూర్య మీద ఇన్వెస్ట్ మెంట్ కు డిస్ట్రిబ్యూటర్లు జంకే పరిస్థితి. దెబ్బకు ఇకపై మార్కెట్ పుంజుకోవాలి అంటే ఓ రెండు బ్లాక్ బస్టర్స్ పడితే తప్ప కష్టమే