Begin typing your search above and press return to search.

ఎన్‌ జీకే రైట్స్.. వాస్త‌వంగా ఇదీ సీను

By:  Tupaki Desk   |   29 May 2019 6:23 AM GMT
ఎన్‌ జీకే రైట్స్.. వాస్త‌వంగా ఇదీ సీను
X
తెలుగులో సూర్య మార్కెట్ ఎంత‌? `సింగం` సిరీస్ త‌ర్వాత అత‌డు న‌టించిన సినిమాలేవీ స‌రైన విజ‌యం ద‌క్కించుకోని నేప‌థ్యంలో అత‌డి మార్కెట్ డౌన్ ఫాల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఎంత పెద్ద అగ్ర హీరో అయినా.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ట్రేడ్ స‌ర్కిల్స్ ముచ్చ‌ట‌ పూర్తిగా వేరు క‌దా? అందుకే ప్ర‌స్తుతం సూర్య వాస్త‌వ‌ మార్కెట్ ఎంత‌? అంటూ స‌ర్వ‌త్రా జ‌నాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

సూర్య న‌టించిన `ఎన్‌ జీకే` ప్రీరిలీజ్ బిజినెస్ గురించిన ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దాదాపు 45 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన‌ ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ 110 కోట్ల మేర ప‌లికింది. తెలుగు రైట్స్ కి 9 కోట్లు ప‌లికింద‌ని చ‌ర్చ సాగింది. అయితే తెలుగు రైట్స్ ఇంత ప‌లికిందా? ప‌్ర‌స్తుతం స‌న్నివేశం లో సూర్య‌కు అంత రేంజు ఉందా? అంటూ ఆస‌క్తిక‌ర డిబేట్ ర‌న్ అవుతోంది. తెలుగు రైట్స్ ని 9 కోట్ల‌కు కొన్నామంటూ ప్ర‌చారం సాగినా అది ఉత్తుత్తే..!! ఎన్‌ జీకే 5 కోట్ల షేర్ వ‌సూళ్లు చేస్తే ప్ర‌స్తుత స‌న్నివేశంలో గొప్ప‌నే అన్న విశ్లేష‌ణ సాగుతోంది. షేర్ ఎంత వ‌స్తే ఆ మేర‌కు మాత్ర‌మే ట్రేడ్ క్ర‌య‌విక్ర‌యాలు జ‌రిగే వీలుందని ఓ ఎన‌లిస్ట్ చెప్ప‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇక సూర్య లాంటి స్టార్ సినిమా క్లిక్క‌యితే 10-20 కోట్లు వ‌సూలు చేసే వీలుంటుంద‌ని వేరొక ట్రేడ్ నిపుణుడు విశ్లేషించారు. హిట్టు కొడితే తెలుగు స్టార్ హీరోల రేంజులో తెచ్చే వీలుంద‌ని కొంద‌రు విశ్లేషించ‌డం ఆస‌క్తిక‌రం.

తెలుగు రాష్ట్రాల్లో ప్రీబిజినెస్ 5కోట్ల మేర‌కు ప‌రిమిత‌మ‌నేది ఓ విశ్లేష‌ణ సాగుతోంది. ఇక‌పోతే ఎన్‌ జీకే చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత .. `సింగం` తెలుగు వెర్ష‌న్ పంపిణీదారుడు కె.కె.రాధామోహ‌న్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. సూర్య త‌దుప‌రి చిత్రం రాధామోహ‌న్ నిర్మాణంలో ఉంటుందా? అంటే అలాంటిదేమీ లేద‌ని తెలుస్తోంది. రాధామోహ‌న్ తో స్ట్రెయిట్ సినిమాలో న‌టిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు.. అది నిర్మాత‌ల వైపు నుంచే తెలియాల‌ని.. ప్ర‌తిదీ కుదిరితేనే చేయ‌గ‌లమ‌ని నిన్న‌టి ఇంట‌ర్వ్యూలో సూర్య అన్నారు. తెలుగు స్ట్రెయిట్ సినిమా చేయ‌రా? అన్న ప్ర‌శ్న‌కు.. ఇక్క‌డ నిర్మాత‌లు వారి లెక్క‌లు అన్నీ ఉంటాయి క‌దా? అన్నారు నిజాయితీగా సూర్య‌.

నిన్న సాయంత్రం ప్రీరిలీజ్ వేడుక‌లో సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ -``ఎన్‌.జి.కె సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎస్‌.ఆర్‌.ప్రభుకి థాంక్స్‌. పెద్ద హిట్స్‌ సాధించిన సూర్య గ‌త‌ సినిమాలకు ధీటుగా ఉంటుందని భావిస్తున్నాను`` అన్నారు. తెలుగు వెర్ష‌న్ రిలీజ్ చేస్తున్న కెకె రాధామోహ‌న్ కి సూర్య కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.