Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'ఎన్జీకే'
By: Tupaki Desk | 31 May 2019 9:31 AM GMTచిత్రం : 'ఎన్జీకే'
నటీనటులు: సూర్య - సాయిపల్లవి - రకుల్ ప్రీత్ - దేవరాజ్ - బాలా సింగ్ - పొన్ వన్నన్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: శివకుమార్ విజయన్
మాటలు: రాజేష్ మూర్తి
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్ బాబు - ఎస్.ఆర్.ప్రభు
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీ రాఘవ
వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్న సూర్య.. ఈసారి విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ (తెలుగులో శ్రీ రాఘవ)తో జట్టు కట్టి చేసిన సినిమా ‘ఎన్జీకే’. కాంబినేషన్ క్రేజ్ వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఎన్జీకే’ ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.
కథ:
ఎన్జీకే అనబడే నందగోపాల కృష్ణ (సూర్య) ఎంటెక్ పూర్తి చేసి తన ఊరిలో అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. ఎవరికి ఏ సాయం అవసరమైనా చేస్తుంటాడు. తన ఊరి కుర్రాళ్లలో స్ఫూర్తి రగిల్చి ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెడతాడు. దీని గురించి ఊరిలో అందరిలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేయడం కొందరికి కంటగింపుగా మారిపోతుంది. దీంతో అతడిని పలు రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో సాయం కోసం నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అతను సాయం చేసినట్లే చేసి ఎన్జీకేను ఇరుకున పెడతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యే దగ్గర అసిస్టెంటుగా చేరిన ఎన్జీకేకు కొంత కాలానికి రాజకీయాలు వంటబట్టేస్తాయి. ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుని తెలివిగా అడుగులు వేయడం మొదులపెడతాడు. మరి అతడి లక్ష్యమేంటి.. దాన్ని అతనెలా అందుకున్నాడు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమిళ హీరో సూర్య క్లోజ్ ఫ్రెండ్. జగన్ రాజకీయ ప్రస్థానం గురించి అతడికి బాగా తెలుసు. జగన్ విజయం గురించి ‘ఎన్జీకే’ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. జగన్ ఎంత కష్టపడ్డాడో తాను చూశానని.. ఆ కష్టం వల్లే ఈ రోజు సీఎం అవుతున్నాడని చెప్పాడు. మరి ఇదంతా తెలిసిన సూర్య.. ‘ఎన్జీకే’ కథలో హీరో పెద్దగా ఏమీ చేయకుండానే రాజకీయాల్లో ఎదిగిపోతున్నట్లు.. చివరికి ఏకంగా సీఎం కుర్చీనే ఎక్కేస్తున్నట్లు క్యారెక్టర్‌ను తీర్చిదిద్దిన దర్శకుడు సెల్వ రాఘవన్ ను ప్రశ్నించి ఉండాలి. కానీ కొన్నేళ్లుగా జడ్జిమెంట్ తేడా కొట్టేసి తన స్థాయికి తగని సినిమాలు చేస్తూ వస్తున్న సూర్య.. ‘ఎన్జీకే’ దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా విచక్షణ కోల్పోయాడేమో అనిపిస్తుంది. సెల్వ రాఘవన్ ను గుడ్డిగా నమ్మేసి అతను చెప్పిందల్లా చేసుకుపోయినట్లున్నాడు. ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరున్న సెల్వ పూర్తిగా ఔట్ డేట్ అయిపోయాడనడానికి ‘ఎన్జీకే’ సూచికగా నిలుస్తుంది. సూర్య-సెల్వ ఇద్దరి కెరీర్లోనూ అత్యంత పేలవమైన సినిమాల్లో ‘ఎన్జీకే’ ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు.
ప్రేక్షకుల అభిరుచి, ఆలోచనలు ఇప్పుడు ఎంతగానో మారాయి. ఏదైనా వాస్తవికంగా ఉండాలని కోరుకుంటున్నారు. అతి సామాన్యుడైన హీరో.. రాజకీయాల్లోకి వచ్చి.. ముఖ్యమంత్రి పీఠం ఎక్కేసే కథ అంటే.. ఒకప్పటిలా సినిమాటిక్ స్టయిల్లో తీస్తే ఒప్పుకోవట్లేదు. ఆ హీరో ఎత్తుగడలు.. ఎదుగుదల అన్నీ కూడా వాస్తవికంగా.. కన్విన్సింగ్ గా ఉండాలనే కోరుకుంటున్నారు. అక్కడక్కడా కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుంటే తీసుకోవచ్చు.. డ్రామా పండించవచ్చు.. కానీ వాస్తవ పరిస్థితులతో పోల్చుకుంటే కాస్త దగ్గరగా ఉండేలా ఇలాంటి కథలు సాగాలనే ఆశిస్తారు ప్రేక్షకులు. సెల్వ రాఘవన్ లాంటి ఇంటలిజెంట్ డైరెక్టర్.. సూర్య లాంటి మంచి అభిరుచి ఉన్న హీరోతో సినిమా తీశాడటంటే వాస్తవ పరిస్థితులపై ఎంతో అధ్యయనం చేశాకే రంగంలోకి దిగి ఉంటాడని.. ప్రేక్షకులు రిలేటయ్యే పకడ్బందీ కథాకథనాలతో మెప్పిస్తాడని.. కొత్తగా ఏదో ఒకటి చూపిస్తాడని ఆశిస్తాం. కానీ ‘ఎన్జీకే’లో ఈ లక్షణాలు ఎంతమాత్రం లేవు.
‘ఎన్జీకే’లో హీరో ఇలా రాజకీయాల్లోకి అడుగుపెట్టేయడం.. అలా పేరు తెచ్చేసుకోవడం.. ఏదో ఒక ధర్నా చేసేసి.. ఇంకో స్పీచ్ ఇచ్చేసి సీఎం అయిపోవడం చూస్తే మనం ఏ రోజుల్లో ఉన్నాం అన్న ప్రశ్న ఉదయిస్తుంది. సెల్వ రాఘవన్ ఎంతగా ఔట్ డేట్ అయిపోయాడో అనిపిస్తుంది. అసలే అతి సాధారణమైన, ఎన్నోసార్లు చూసిన కథ.. పైగా దాన్ని అత్యంత పేలవంగా తెరకెక్కించడంతో ‘ఎన్జీకే’ ఎక్కడా కూడా ఎంగేజింగ్ గా అనిపించదు. విపరీతమైన తమిళ నేటివిటీ.. సహజత్వం లేని సన్నివేశాల వల్ల మొదలైన 20 నిమిషాలకే ‘ఎన్జీకే’ నస పెట్టడం మొదలుపెట్టేస్తుంది. సూర్య తన పెర్ఫామెన్స్ తో సినిమాను నిలబెట్టడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. బిగి లేని కథనం.. కొత్తదనం లేని సన్నివేశాలు ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేస్తాయి.
సెల్వ చాలా ఏళ్ల కిందట ‘పుదుపేట్టై’ అనే పొలిటికల్ మూవీ తీశాడు. అది తెలుగులో ‘ధూల్ పేట’ అనే పేరుతో విడుదలైంది. అప్పుడది అంతగా ఆడలేదు కానీ ఇప్పుడు చూస్తే అది ఒక క్లాసిక్ లాగా అనిపిస్తుంది. అప్పటి రాజకీయ పరిస్థితుల్ని ఎంత బాగా అధ్యయనం చేశాడో.. ఎంత పకడ్బందీగా కథ నడిపాడో.. ఏం ట్విస్టులిచ్చాడో అని అబ్బురపడిపోతాం. అలాంటి ిసినిమా తీసిన దర్శకుడు.. సూర్య లాంటి హీరోను పెట్టి ఇంత పేలవమైన చిత్రాన్ని అందించడం జీర్ణించుకోలేని విషయం. ‘ఎన్జీకే’ ప్రథమార్ధంలో అయినా అక్కడక్కడా కొంత మేర వినోదాన్ని పంచుతుంది. ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ ద్వితీయార్ధంలో మాత్రం దీన్ని భరించడం చాలా కష్టం. తలాతోకా లేని.. బోరింగ్ సీన్లతో ‘ఎన్జీకే’ను పూర్తిగా పట్టాలు తప్పించేశాడు సెల్వ. ఇక పాటల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఈ సమ్మర్లో ఏసీ థియేటర్లలో కూర్చుంటే ద్వితీయార్ధంలో నిద్ర ఆపుకోవడం చాలా కష్టం. చివర్లో సూర్య ఒక స్పీచ్ ఇస్తాడు. మధ్యలో ఏమైనా అద్భుతాలు జరిగిపోయాయేమో అనిపించేంత బాగుంటుంది ఆ స్పీచ్. ‘ఎన్జీకే’ మొత్తంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది అది మాత్రమే. సినిమా అంతటా కత్తి పట్టుకుని అందరినీ తెగనరికే హీరో.. చివర్లో శాంతి వచనాలు పలికినట్లే ఉంటుంది ఈ వ్యవహారం. రెండు గంటలకు పైగా నసపెట్టి చివర్లో ఈ స్పీచ్ సీన్ తో ప్రేక్షకుల ఫీలింగ్ మార్చాలంటే ఎలా సాధ్యమవుతుంది?
నటీనటులు:
సూర్యను చూస్తున్నంతసేపూ.. ఇలాంటి సినిమా కోసం అంత కష్టపడ్డాడేంటి అనిపిస్తుంది. తన వంతుగా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడతను. చాలా సన్నివేశాల్లో కళ్లతో భావాలు పలికించిన తీరు ఆకట్టుకుంటుంది. కానీ అతడి పాత్రలోనే ఏ విశేషం లేకపోయింది. సాయిపల్లవి రెండు మూడు సన్నివేశాల్లో తన ప్రత్యేకతను చాటుకుంది. కానీ ఆమె స్థాయికి తగ్గ పాత్ర కాదిది. రకుల్ ప్రీత్ పాత్రకు మొదట్లో ఇచ్చిన బిల్డప్ చూసి ఏదో అనుకుంటాం. కానీ ఆ తర్వాత దాన్ని కూడా తేల్చి పడేశారు. ఐతే లుక్ పరంగా రకుల్ కు ది బెస్ట్ క్యారెక్టర్లలో ఇదొకటి. ఆమెను చాలా అందంగా.. ఆకర్షణీయంగా చూపించాడు దర్శకుడు. మిగతా నటీనటులంతా తెలుగు ప్రేక్షకులతో అంతగా కనెక్షన్ లేని వాళ్లే. సినిమాతో మరింతగా డిస్కనెక్ట్ అయిపోయేలా చేస్తారు వాళ్లందరూ.
సాంకేతికవర్గం:
యువన్ శంకర్ రాజా పాటలు ఒక్కటంటే ఒక్కటీ ఆకట్టుకునేలా లేవు. వినసొంపుగా లేకపోవడం ఒక సమస్య అయితే.. తమిళ నేటివిటీ గుప్పుమంటుంటుంది. పాటల డబ్బింగ్ కూడా అలాగే చేసినట్లున్నారు. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం యువన్ ఆకట్టుకున్నాడు. విషయం లేని సన్నివేశాల్ని కూడా ఎలివేట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. శివకుమార్ విజయన్ ఛాయాగ్రహణం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. అతను ఎంచుకున్న కలర్ థీమ్.. ఈ కథకు సూట్ కాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు సెల్వ రాఘవన్.. ఎక్కడా తన ముద్రను చూపించలేదు. ఒకప్పుడు అతను ఫ్లాప్ తీసినా.. ఏదో ఒక ప్రత్యేకత ఉండేది. అతను ఎలాంటి కథ ఎంచుకున్నా.. ఎక్కడో ఒక చోట సర్ ప్రైజ్ చేస్తాడని.. నరేషన్ కొత్తగా ఉంటుందని ఆశిస్తాం. ఐతే సెల్వ టచ్ ఎంతమాత్రం లేని సినిమాగా ‘ఎన్జీకే’ను చెప్పొచ్చు. కథ.. స్క్రీన్ ప్లే.. దర్శకత్వం.. ఇలా అన్ని విభాగాల్లోనూ సెల్వ రాఘవన్ నిరాశ పరిచాడు.
చివరగా: ఎన్జీకే.. పరమ బోరింగ్ ‘గోపాలం’
రేటింగ్-1.5/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre