Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ముత్యం ధ‌రించిన కెంపు

By:  Tupaki Desk   |   2 Feb 2019 10:31 AM GMT
ఫోటో స్టోరి: ముత్యం ధ‌రించిన కెంపు
X
మోడ‌ల్ .. టీవీ న‌టి.. యాంక‌ర్ .. మ‌ల్టీ ట్యాలెంటెడ్ గాళ్ నియా శ‌ర్మ గురించి ఇప్పుడే ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. `తెనాలి రామ‌` షోతో యూట్యూబ్ క్వీన్ గా పాపుల‌రై, `ఏక్ హ‌జారోన్ మే మెరిట్ బెహ‌నా హై` టీవీ షోతో జోరుగా వైర‌ల్ అయిపోయంది. 2018 ఆసియాస్ సెక్సీయెస్ట్ గాళ్ గా ఎంపికైన త‌ర్వాత వ‌ర‌ల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ వ‌రుస ఫోటోషూట్లు షేర్ చేస్తూ సామాజిక మాధ్య‌మాల్లో వేడి పెంచుతోంది.

సునామీ ముందు సైలెన్సులా విరుచుకుప‌డుతోందంటే అతిశ‌యోక్తి కాదు. గ‌త రెండు వారాలుగా ఈ అమ్మ‌డి ఇన్ స్టాగ్ర‌మ్ వేడెక్కించే ఫోటోల‌తో మ‌తి చెడ‌గొడుతోంది. బికినీ ట్రీట్.. టూపీస్ ట్రీట్.. బీచ్ శాండ్విచ్ ట్రీట్ అంటూ చెల‌రేగిపోతోంది. తాజాగా మ‌రో హాట్ ఫోటోని నియా శ‌ర్మ త‌న అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ ఫోటోలో ఈ అమ్మ‌డు ఓ ఖ‌రీదైన ఇన్ వోర్ బ్రాండ్ ని ప్ర‌మోట్ చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌ల కెల్విన్ క్లెయిన్ ట్రెండ్ పాపుల‌రైన త‌ర్వాత భామ‌లంతా ఇలా `బ్రాం`బోయ్ అని భ‌య‌ప‌డేలా చేస్తున్నారు. ఈ సిరీస్ లో నియాశ‌ర్మ నుంచి వ‌చ్చిన హాట్ ఫోటో ఇది.

టీవీ నుంచి పెద్ద తెర ప‌య‌నం కోస‌మేనా ఇదంతా? అంటూ నియాని చూసిన‌ కుర్ర‌కారు తెగ ఇదేపోతున్నారు. ఆ కోవ‌లో ప‌రిశీలిస్తే.. ఊర్వ‌శిరౌతేలా - గోల్డ్ ఫేం మౌనిరాయ్ సౌత్ ఇండ‌స్ట్రీస్ లోకి దూసుకు రావ‌డంపై చ‌ర్చ సాగుతోంది. ఈ భామ‌లు అటు బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ అవ‌కాశాల కోసం గాలం వేస్తున్నారు. నియా శ‌ర్మ అంత‌కుమించి దూసుకొచ్చే ప్లాన్ లో ఉంది. మ‌రీ ఈ రేంజులో కెంపును, వ‌జ్రాన్ని, మంచి ముత్యాన్ని మ‌న‌వాళ్లు కూడా విడువ‌రు. అందుకే త‌న‌ గ్రాఫ్ కూడా అంతే వేగంగా రాకెట్ స్పీడ్ తో దూసుకొస్తుందేమో చూడాలి.