Begin typing your search above and press return to search.

‘పురుషాంగం’తో కేక్ పార్టీపై స్పందించిన హీరోయిన్

By:  Tupaki Desk   |   19 Oct 2020 5:31 PM GMT
‘పురుషాంగం’తో కేక్ పార్టీపై స్పందించిన హీరోయిన్
X
తన పుట్టిన రోజు సందర్భంగా పురుషాంగాన్ని పోలిన డిజైన్ తో ఉన్న కేక్ ను కట్ చేసి హీరోయిన్ నియాశర్మ సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు, కొందరు సంప్రదాయవాదులు మండిపడ్డారు. మన సంస్కృతిని చెడగొడుతున్నావ్ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు.

ఇప్పటికీ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. జనం తెగ చర్చించుకుంటూ హీరోయిన్ నియా శర్మపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అలాంటి కేక్ ను ఒక ఆడపిల్ల అయ్యిండి ఎలా కట్ చేస్తావ్ అంటూ మండిపడుతున్నారు.

దీంతో ఎట్టకేలకు ఈ వివాదంపై హీరోయిన్ నియాశర్మ స్పందించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే తాను రోజువారి జీవితంలో వచ్చే ఒత్తిడి నుంచి బయటపడడానికి మాత్రమే సోషల్ మీడియాను చూస్తానని.. ఇలాంటి ట్రోల్స్ ను తాను అస్సలు పట్టించుకోనని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు, ఫొటోలు, వీడియోలు అన్నీ ఫన్ కోసమే తప్ప వేరే ఉద్దేశం లేదని.. ట్రోలింగ్ లాంటి విషయాలను తాను పట్టించుకోనని కుండబద్దలు కొట్టింది.

ఇలాంటి విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. కొత్త విషయాలను నేర్చుకోవడంపై దృష్టి పెడుతానని నియా శర్మ తాజాగా స్పష్టం చేసింది.