Begin typing your search above and press return to search.
చాలామంది స్టార్ కిడ్స్ కంటే నేను చాలా బెటర్: నియా శర్మ
By: Tupaki Desk | 25 Sep 2021 4:02 AM GMTఅందంగా ఉన్నవాళ్లు .,. అభినయం పట్ల ఆసక్తి ఉన్నవారు, నటన దిశగా అడుగులు వేస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. అయితే చిత్రపరిశ్రమ నిజంగానే చాలా చిత్రమైనది. కొందరిని మొదటి సినిమాతోనే స్టార్స్ ను చేస్తుంది .. మరికొందరిని చివరిసినిమా వరకూ ఎదురుచూసేలా చేస్తుంది. ఇక ఏ పాత్రతో తమ కెరియర్ గ్రాఫ్ ఊపందుకుంటుందా అనే ఆశతోనే చాలామంది తమ కెరియర్ ను నెట్టుకొచ్చేస్తూ ఉంటారు. ఇక సినిమాలు వచ్చినప్పుడు చేద్దాంలే .. అప్పటివరకూ సీరియల్స్ చేసేద్దాం అనుకునేవారూ ఎక్కువే.
అలా నియా శర్మ కూడా గంపెడాశతోనే సినిమా ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది. ఏదో ఒక కథ కలిసొస్తుంది .. ఏదో ఒక ఛాన్స్ తనని తీసుకెళ్లి స్టార్స్ జోన్ లో పడేస్తుందని ఆమె అనుకుంది. కానీ సినిమా ఫీల్డ్ లో రాణించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు .. అభినయం మాత్రమే తెలిస్తే చాలదు. అందుకు ఎంతో లౌక్యం కావాలి. లౌక్యం లేకపోతే ఆకాశాన్ని అందుకోవడమైనా తేలిక అవుతుందేమోగానీ, అవకాశాలను అందుకోవడం మాత్రం చాలా కష్టం. కారణమేదైనా నియా శర్మ మాత్రం సినిమాల్లో తాను ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయిందనేది మాత్రం వాస్తవం.
ప్రస్తుతం ఆమె హిందీ సీరియల్స్ తో బిజీగా ఉంది. తన కెరియర్ పట్ల చాలా సంతృప్తికరంగాను ఉంది. అయితే సోషల్ మీడియా వేదికగా ఆమె బాడీ షేమింగ్ కామెంట్స్ ను భారీగానే ఎదుర్కొంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ప్రస్తావన రావడంతో, ఆమె తనదైన స్టైల్లో స్పందించింది. "నేను అందంగా లేననీ .. నా రూపం ఆకర్షణీయంగా లేదనీ .. అందువల్లనే తనకి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదనీ .. రావడం లేదని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి కామెంట్లు తట్టుకోవడం నాకు అలవాటైపోయింది.
నేను అందంగా లేనని కామెంట్లు పెట్టేవాళ్లు .. స్టార్ కిడ్స్ ఫేస్ లు పరిశీలనగా చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఎవరు అందంగా ఉన్నారో .. ఎవరు అందంగా లేరో. స్టార్ పేరెంట్స్ పేరు పక్కన లేకపోతే వాళ్ల ముఖాలను చూసేది ఎవరు? స్టార్ స్టేటస్ తో సినిమాలు పట్టుకుని థియేటర్లకు వస్తున్నారు కాబట్టి వాళ్ల ముఖాలను చూస్తున్నారే తప్ప, నిజానికి వాళ్లకి అంత సీన్ లేదు. స్టార్ కిడ్స్ కంటే నేను చాలా బెటర్ .. అలాంటి వాళ్లందరితో పోల్చి చూసుకుంటే నేను అందగత్తెనే. వాళ్లను చూసిన తరువాత నన్ను నేను చూసుకుంటే, నాలో పెద్దగా లోపాలేం కనిపించడం లేదు కూడా" అంటూ చెప్పుకొచ్చింది.