Begin typing your search above and press return to search.

నిక్కు పీసీలో అసలు నచ్చింది అదేనట!

By:  Tupaki Desk   |   2 Aug 2018 10:31 AM GMT
నిక్కు పీసీలో అసలు నచ్చింది అదేనట!
X
జనరల్ గా ఇద్దరు పెళ్లి సమయంలో అబ్బాయి కంటే అమ్మాయి వయసు తక్కువ ఉండేలా చూస్తారు. ఇది సహజంగా ప్రపంచం అంతా ఉన్నదే. కొన్ని సార్లు నలభై యాభై ఏళ్ళ వాళ్ళు కూడా పడుచు పిల్లలను పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఎక్కడిదాకానో ఎందుకు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామికి అయన రెండో భార్య రాధికకు ఉన్న వయసు తేడా అందరికీ తెలిసిందే.

కానీ దీనికి వ్యతిరేకంగా జరిగితే అది మాత్రం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కంటే అయన భార్య అంజలి నాలుగేళ్ళు పెద్దది. ఇవన్నీ ఓల్డ్ టాపిక్స్. మరి తాజాగా గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా- అమెరికన్ సింగర్ నిక్ జోనస్ రిలేషన్ ఓ ట్రెండింగ్ టాపిక్. ఆల్రెడీ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయిందని మీడియాలో కథనాలు వెలువడుతున్నా, వాళ్ళు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. నిక్కు కంటే ప్రియాంక పదేళ్ళు పెద్దది అనే విషయం తెలిసిందే కదా.

దీని గురించి నిక్కును అడిగితే అతనికి ఆ వయసు తేడానే తనకు నచ్చిన విషయమని చెప్పాడని ఓ హాలీవుడ్ ఎంటర్ టైన్మెంట్ వెబ్ సైట్ కథనం ప్రచురించింది. అంతే కాదు.. అసలు నిక్కు తనకంటే వయసులో పెద్దగా ఉన్న ఆడాళ్ళంటే వల్లమాలిన ప్రేమని - దానికి ఉదాహరణగా నిక్ గత ప్రేమాయణాలను ఉదహరించింది. గతంలో కేట్ హడ్సన్ ను డేట్ చేశాడు నిక్. ఆమె తనకంటే 13 సంవత్సరాలు పెద్దదట. ఆ తర్వాత డెల్టా గుడ్రెమ్ ను ప్రేమించాడు.. ఆవిడ నిక్కు కన్నా 8 ఏళ్ళు పెద్దదట. ఏంటో ఈ నిక్కు.. పెద్దవాళ్ళని అందులో పెద్ద ఆడవాళ్ళని గౌరవించామంటారు మన పెద్దాళ్ళు.. ఈ నిక్కేమో వాళ్ళని ప్రేమిస్తా.. పెళ్లి చేసుకుంటానంటున్నాడు. సరేలే... అసలే అది హలీవుడ్డు కనీసం లేడి ని పెళ్లి చూసుకుంటున్నాడని మనం సంతోషించాలి.. కండలు తిరిగిన జెంటు ను చూసుకోకుండా!