Begin typing your search above and press return to search.

ప్రియాంక అంటే గుర్రుగా ఉన్న వ్యాలెంటినా జోనాస్!

By:  Tupaki Desk   |   7 March 2019 2:30 AM GMT
ప్రియాంక అంటే గుర్రుగా ఉన్న వ్యాలెంటినా జోనాస్!
X
గ్లోబల్ సుందరి ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను గత ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి ముందుగా ప్రియాంక - నిక్ ప్రేమ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రియాంక కుటుంబ సభ్యులు.. నిక్ జోనాస్ కుటుంబ సభ్యులు ఇద్దరి ప్రేమను మనస్ఫూర్తిగా అంగీకరించడంతో ప్రేమ జంట ఒక్కటయ్యింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో హిందూ.. క్రిస్టియన్ సంప్రదాయంలో రెండు సార్లు ప్రియాంక-నిక్ ల వివాహం జరిగింది.

ఇద్దరి కుటుంబాల్లో అందరూ కుటుంబ సభ్యులు ఈ కళ్యాణానికి తమ అంగీకారం తెలిపినా జోనాస్ కుటుంబ సభ్యులలో ఒకరికి మాత్రం ప్రియాంక నచ్చలేదట. ఈ విషయాన్ని నిక్ సోదరుడు కెవిన్ జోనాస్ వెల్లడించడం విశేషం. రీసెంట్ గా జోనాస్ బ్రదర్స్ ముగ్గురూ(నిక్.. కెవిన్.. జో) 'ది లేట్ నైట్ షో విత్ జేమ్స్ కార్డన్' అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ షోలో ఈ కెవిన్ ఈ విషయాన్ని తెలిపాడు. రెండేళ్ల వయసున్న కెవిన్ చిన్న కూతురు వ్యాలెంటినా అంటే నిక్ కు మహా ప్రాణమట. అలానే వ్యాలెంటినా కూడా నిక్ అంటే చాలా పొసెసివ్ గా ఉంటుందట. అందుకే ఆ పాపకు ప్రియాంక అంటే కోపమట!

ప్రియాంక కనుక వ్యాలెంటినా పై ప్రేమగా చెయ్యి వేస్తే వెంటనే ఆ చేతిని నెట్టేస్తుందట. అది ఒకసారి కాదు ఇప్పటికి చాలాసార్లు జరిగిందని తెలిపాడు. ఈ విషయం చెప్తున్నప్పుడు నిక్ నవ్వుతూ "అదంతా ఫన్నీగా అనిపిస్తుంది" అన్నాడు. ఎర్రగా బుర్రగా తన బాబాయ్ ని పీసీ తన్నుకుపోయిందని వ్యాలెంటినా కాస్త గుర్రుగా ఉందేమో.. త్వరలోనే సర్దుకుంటుంది లెండి.