Begin typing your search above and press return to search.
నిక్ జోనస్.. ప్రియాంకను కలిపింది ఎవరో తెలుసా?
By: Tupaki Desk | 23 July 2021 11:30 PM GMTమోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి, బాలీవుడ్ లో టాప్ స్టార్ గా వెలుగొందింది ప్రియాంక చోప్రా. ఇప్పుడు హాలీవుడ్ లోనూ జెండా పాతి గ్లోబల్ బ్యూటీగా సత్తా చాటుతోంది. ఆకర్షించే అందంతో.. ఆకట్టుకునే యాక్టింగ్ తో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ప్రియాంక. దాదాపు రెండు దశాబ్దాలపాటు బాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా సత్తాచాటిన ప్రియాంక.. ఆ తర్వాత అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని హాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. ఈ క్రమంలో ఇంగ్లీష్ లో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అయితే.. ఈ ఇండియన్ బ్యూటీ నిక్ జోనస్ ను ఎప్పుడు కలుసుకుంది? అసలు వీరిద్దరి మధ్య జోడీ ఎలా కుదిరింది? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. తాజాగా.. వీటికి ఆన్సర్ ఇచ్చేసింది ప్రియాంక.
2002లో తమీజాన్ అనే తమిళ్ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. ఆ వెంటనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. బీటౌన్ లో అడుగు పెట్టిన తర్వాత ప్రియాంక వెనుదిరిగి చూసుకోలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతూనే ఉంది. ఈ క్రమంలోనే అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ తో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లికి ముందు వీళ్లిద్దరి మధ్య లవ్ స్టోరీ కూడా నడిచింది. 2017 నుంచి వీరు విదేశాల్లో కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత ఓపెన్ గానే హగ్గులు, కిస్సులు నడిచాయి. ఆ తర్వాత వీరి పెళ్లి జరిగింది.
అయితే.. వీళ్ల పరిచయం మాత్రం 2016లోనే జరిగిందట. ప్రియాంకను చూసిన నిక్ జోనస్.. ట్విటర్ ద్వారా మెసేజ్ చేశాడట. అలా వీళ్లిద్దరూ మాట్లాడుకున్న తర్వాత.. ఒక రోజు ప్రియాంక మొబైల్ నంబర్ అడిగాడట నిక్. అతని బిహేవియర్ నచ్చడంతో ఫోన్ నంబర్ ఇచ్చేసిందట ప్రియాంక. అప్పటి నుంచి చాటింగులతోపాటు ఫోన్లో మీటింగులు కూడా మొదలయ్యాయని చెప్పిందీ బ్యూటీ. అయితే.. వీళ్లిద్దరూ కలుసుకున్నది మాత్రం 2017లో జరిగిన ఆస్కార్ అవార్డుల ఫంక్షన్లో వీరు ఎదురు పడ్డారు. అప్పటి నుంచి మొదలైన డేటింగ్ 2018లో పెళ్లిగా మారింది.
అయితే.. ప్రియాంక పెళ్లి విషయం ఇలా ఉంటే.. నిక్ జోనస్ ను పెళ్లి చేసుకోవడానికి ముందు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు కూడా జరిగాయట. నిజానికి.. ఇండియన్ స్క్రీన్ పై వెలిగిపోతున్న సమయంలోనే ప్రియాంకపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే.. వాటన్నింటికీ సైలెంట్ గానే చెక్ పెట్టిందీ బ్యూటీ. అయితే.. ఎవ్వరూ ఊహించని విధంగా.. నిక్ జోనస్ చేయి పట్టుకుందీ అమ్మడు. కానీ.. నిక్ కన్నా ముందు.. హిందీ టీవీ నటుడు మోహిత్ రైనాను ప్రియాంక పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు భావించారట.
ప్రియాంక వాళ్ల ఆంటీనే ఈ సంబంధం చూసిందట. మోహిత్ రైనా ప్రియాంకకు మంచి జోడీ అవుతాడని ఆమె భావించిందట. ఇదే విషయాన్ని ప్రియాంక పేరెంట్స్ కూడా చెప్పిందట. అయితే.. అప్పటికే ప్రియాంక బాలీవుడ్‌లో పెద్ద స్టార్. మోహిత్ ను చూస్తే టీవీ రంగంలో చిన్న నటుడు. అందువల్ల ఆమె పేరెంట్స్ అంగీకరించలేదట. ఆ విధంగా ప్రియాంక.. మోహిత్ కాదని, జోనస్ ను పెళ్లి చేసుకుంది.
ఇక, ప్రియాంక కెరీర్ ను చూస్తే.. హాలీవుడ్ లోనూ స్టార్ గా రాణిస్తోందీ బ్యూటీ. ఓ వైపు నటిస్తూనే.. తన అభిరుచిని కూడా చాటుకుంటోంది. అమెరికాలో ఇండియన్ స్టైల్ రెస్టారెంట్ ప్రారంభించింది. ఇక, తన అనుభవాలను వివరిస్తూ రాసిన ‘అన్ ఫినిష్డ్’ పుస్తకం.. ప్రపంచవ్యాప్తంగా రిలీజై సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇప్పటి వరకు తాను నిర్వర్తించిన బాధ్యతలు, వాటి తాలూకు జ్ఞాపకాల సమాహారంగా ‘అన్ ఫినిష్డ్’ పుస్తకాన్ని తీసుకొచ్చారు. సినీ నటిగా, ప్రొడ్యూసర్ గా, రైట్స్ యాక్టివిస్ట్ గా, యునిసెఫ్ ప్రచారకర్తగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు ప్రియాంక. వాటన్నింటినీ ఇందులో పేర్కొన్నారు. ఆవిష్కరించిన వారం రోజుల్లోనే అమ్మకాల విషయంలో దుమ్ము లేపిన ఈ బుక్.. ఏకంగా న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్‌లో స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ విధంగా.. అటు కెరీర్, ఇటు ఫ్యామిలీతో ఫుల్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది ప్రియాంక.