Begin typing your search above and press return to search.

పీసీ - నిక్‌ ల హనీమూన్‌ ఎక్కడంటే..!

By:  Tupaki Desk   |   11 Dec 2018 11:03 AM GMT
పీసీ - నిక్‌ ల హనీమూన్‌ ఎక్కడంటే..!
X
బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా మరియు నిక్‌ జొనస్‌ లు ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైన విషయం తెల్సిందే. పెళ్లికి ముందు పదిహేను రోజుల పాటు వీరి పెళ్లి హడావుడి కొనసాగింది. పెళ్లి తర్వాత కూడా రిసెప్షన్‌ అంటూ హడావుడి కనిపించింది. ఇటీవలే వీరు అంబానీ ఇంట జరుగబోతున్న ఈషా - ఆనంద్‌ ల పెళ్లి వేడుక ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. ఇక వీరిద్దరు ప్రస్తుతం హనీమూన్‌ లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రియాంక చోప్రా మరియు నిక్‌ లు ప్రస్తుతం ఒమన్‌ దేశంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలను కొన్నింటికి పీసీ పోస్ట్‌ చేసింది. ఓమన్‌ లో కొన్ని రోజుల తర్వాత ఈ జంట అమెరికా వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు. అక్కడ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత అంటే వచ్చే నెల మొదటి లేదా రెండవ వారంలో ఇండియాకు వస్తారంటూ బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

2017 ఆస్కార్‌ అవార్డు ప్రధానోత్సవం సందర్బంగా ఒక పార్టీలో వీరిద్దరు కలుసుకున్నారు. ఆ సందర్బంగా వీరిద్దరి పరిచయం అయ్యింది - పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు కూడా డేటింగ్‌ చేసి ఒకరి గురించి ఒకరు తెలుసుకుని పెళ్లి పీఠలు ఎక్కారు. వీరి పెళ్లికి బాలీవుడ్‌ అతిరథ మహారథులు హాజరు అయిన విషయం తెల్సిందే.