Begin typing your search above and press return to search.

‘ఇస్మార్ట్’ హీరోయిన్ కు చేదు అనుభవం.. ఐలవ్యూ చెప్పమన్న డైరెక్టర్!

By:  Tupaki Desk   |   4 Jan 2021 4:15 AM GMT
‘ఇస్మార్ట్’ హీరోయిన్ కు చేదు అనుభవం.. ఐలవ్యూ చెప్పమన్న డైరెక్టర్!
X
‘ఇస్మార్ట్ శంకర్’ హీరోయిన్ నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన తొలి తమిళ్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా చెన్నైలో ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. ఈ స్టేజ్ పై నిధి అగర్వాల్ మాట్లాడుతుండగా.. ఆ చిత్ర దర్శకుడి ప్రవర్తనతో నిధి ఇబ్బంది పడింది. ఆ డైరెక్టర్ తీరుపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తమిళ్ హీరో శింబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈశ్వరన్’. ఇందులో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించింది. ఈ చిత్రంతో నిధి తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోంది. అయితే.. తొలి చిత్రంతోనే అమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆడియో లాంచ్ ఈవెంట్లో సరదా పేరుతో దర్శకుడు సుసీస్థారన్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.

సినిమా గురించి మాట్లాడడానికి హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఆహ్వానించగా.. ఆమె వేదికపై వచ్చి మాట్లాడుతోంది. ఈ క్రమంలో ఆమె వద్దకు వచ్చిన డైరెక్టర్.. హీరోను లవ్ చేస్తున్నానని చెప్పమన్నాడు. ‘‘సింబు మామా.. ఐలవ్ యూ’’ అనాలని చెప్పాడు. దీనికి ఇబ్బంది పడిన హీరోయిన్.. ఆ మాట చెప్పకుండా మరో టాపిక్ మాట్లాడేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ.. డైరెక్టర్ సుసీస్థారన్ పట్టువదలకుండా.. అలా చెప్పాలన్నాడు. ఈ తీరుతో నిధి అసౌకర్యంగా ఫీలైంది.

ఆడియో లాంచ్ వేదికపై అందరూ చూస్తుండగా దర్శకుడు వ్యవహరించిన ఈ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారితీసింది. దర్శకుడి ప్రవర్తన ఎంతమాత్రమూ సమంజసం కాదంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. హీరో అభిమానులను అట్రాక్ట్ చేయడం కోసం దర్శకుడు ఇలా చేయడం పద్ధతికాదంటూ ఫైర్ అవుతున్నారు.

ఈ విషయం చినికి చినికి గాలివానలా మారడంతో దర్శకుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన మాటల్లో వేరే ఉద్దేశం లేదని, ‘సింబు మామా! ఐ లవ్ యు’ అనే డైలాగ్ సినిమాలో ఉందని, అందుకే ఆమెతో స్టేప్ చెప్పించే ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చాడు. అయితే.. కారణం ఏదైనా ఒక లేడీ యాక్ట్రెస్ ను అలా ఫోర్స్ చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నారు నెటిజన్స్.